Monday, December 23, 2024

విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ఉపాధి అవకాశాలు

- Advertisement -
- Advertisement -

అబ్దుల్లాపూర్‌మెట్: విద్యార్థ్ధులకు నాణ్యమైన విద్యతో పాటు ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నామని అవంతి గ్రూప్ జనరల్ సెక్రటరీ ప్రియాంక అన్నారు. బుధవారం అబ్దుల్లాపూర్‌మెట్ మండలం గుంతపల్లిలోని అవంతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ 3వ సంవత్సరం విద్యార్థులకు ఇండస్ట్రీ ఇన్‌స్టిట్యూట్ ఇంటరాక్షన్ సెషన్‌ను నిర్వ హించారు.

ఈ కార్యక్రమంలో అవంతి గ్రూప్ జనరల్ సెక్రటరీ ప్రియాంక హాజరై మాట్లాడుతూ విద్యార్థులు తమ ఉపాధి అవకాశాలను మెరు గుపరి చేందుకు కళాశాలలో నిర్వహిస్తున్న సర్టిఫికేషన్ కోర్సులను ఉప యోగించుకోవాలని సూచించారు. క్యాంపస్ లీడ్ హెచ్‌ఆర్ ప్రియాంక కు మార్ టిఏజి, టిసిఎస్‌లో పెగా అవకాశాలతో పాటు విద్యార్థ్ధులందరికీ ఉపాధి అవకాశాల గురించి వివరించారు.

టాలెంట్ స్పింట్ సంస్థ ప్రతినిధి గిరిధరన్, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రా మచంద్రారెడ్డి, డైరెక్టర్ డాక్టర్ జయప్రద, ఫ్లెస్‌మెంట్ అధికారి స్వామిరావు, కులకర్ణ క్యాంపస్ ఇంచార్జీ బోస్ బాబు, పిఆర్‌వో శ్రీనివాస్, సిబ్బంది, పెగా సర్టిపైడ్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News