మంగపేట: మంగపేటలోని ప్రభుత్వ కళాశాలలో నాణ్యమైన విద్యను అందిస్తున్నట్టు ఎక్కటి సరోజినీ శేషారెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ గూళ్ళ వెంకటయ్య అన్నారు. మంగళవారం కళాశాలలో విద్యా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల నుంచి తెలంగాణ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు.
అనంతరం కళాశాల ఆవరణలో జాతీయ జెండాను ఆవిష్కరించారు.ప్రిన్సిపాల్ మాట్లాడుతూ ప్రభుత్వ కళాశాలలో ఉన్నత విద్యార్హతలు, అపార అనుభవం కలిగిన అధ్యాపకులు ఉన్నారన్నారు. వారితో నాణ్యమైన విద్య లభిస్తుందని అన్నారు. ఈ సమావేశంలో మార్చి 2023లో జరిగిన ఇంటర్ పరిక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులు జీ హేమలత, మానస, రూపకళ, నీలిమలను ప్రశాంసా పత్రాలు శాలువాలతో సన్మానించారు.
ఉత్తమ ప్రతిభ కనపరిచిన అఖిల, ఎండీ రోషన్ సఫ్రీన్, శరణ్య, అపర్ణ, ఫర్దిన,లకు ప్రశంసా పత్రాలను అందించారు. ఉత్సవాలలో నిర్వహించిన క్రీడా సాంస్కృతిక పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలను అందించారు. కార్యక్రమంలో అద్యపకబృందం రేణుకాదేవి, జోతిర్మయి, సంతోష్ కుమార్, లక్ష్మణ్, అనీల్ కుమార్, రవింద్ర నాయక్, శ్రీనివాస్, చిరంజీవి, శ్యాం తదితరులు పాల్గొన్నారు.
దశాబ్ది ఉత్సవాలలో భాగంగా విద్యా దినోత్సవం
తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా మంగళవారం మండలంలోని అన్ని పాఠశాలలో విద్యా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం పాఠశాలల విద్యార్థులతో కలిసి ర్యాలీనిర్వహించారు. పది సంవత్సరాల కాలంలంలో విద్యా వ్యవస్తలో వచ్చిన మార్పులు, సాధించిన ప్రగతి గురించి తెలియ జేస్తూ గ్రామ కూడళ్ళలో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అనంతరం కరపత్రాలను విద్యార్థుల తల్లిదండ్రులతో ఆవిష్కరించారు.
విద్యా దినో త్సవాన్ని పురస్కరించుకుని మండలంలో ఎంపిక చేసిన ఆరు పాఠశాలల విద్యార్థులకు రా గిజావను ప్రారంభించారు. అలాగే 16 పాఠశాలల్లో పాఠశాల గ్రంథాలయాలను ఏర్పాటు చేసినట్టు మండల విద్యాశాఖ అధికారి లకావత్ రాజేష్ కుమార్‌తెలిపారు. నాలుగు పాఠశాలల్లో డిజిటల్ తరగతులను ప్రారంభించామని అన్నారు.