Monday, December 23, 2024

ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య

- Advertisement -
- Advertisement -
  • మున్సిపల్ చైర్‌పర్సన్ ముల్లి పావని జంగయ్యయాదవ్

ఘట్‌కేసర్: ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య అందుతుందని మున్సిపాలిటీ చైర్‌పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ అన్నారు. ఘట్‌కేసర్ పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర, బాలికల ఉన్నత పాఠశాలలో మన ఊరు మన బడి కార్యక్రమంలో చేపడుతున్న పలు నిర్మాణ పనులు గురువారం చైర్‌పర్సన్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మన ఊరుమన బడి కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు అదనపు తరగతి గదుల నిర్మాణం చేపడుతున్నామని గుర్తు చేశారు.

ప్రభుత్వం పాఠశాలలో విద్యార్థులకు మధ్యాహ్నం భోజనంతోపాటు పాఠ్యపుస్తకాలు, దుస్తులు ఉచితంగా అందిస్తారని, అర్హత కలిగిన ఉపాధ్యాయులతో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని తెలిపారు. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కోరారు. అదనపు తరగతి గదలు నిర్మాణ పనులు త్వరితగతిని పూర్తి చేయాలని, నిర్మాణాలలో నాణ్యత లోపిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బాలుర పాఠశాల ప్రధానోపాధ్యాయులు పాపిరెడ్డి, కాంట్రాక్టర్ కందకట్ల మాధవరెడ్డి, నాయకులు రహీం, వర్క్ ఇన్స్‌పెక్టర్ సన్నీ, రాకేష్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News