Friday, November 15, 2024

ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య

- Advertisement -
- Advertisement -

నాగర్‌కర్నూల్ రూరల్ : ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని జిల్లా విద్యాధికారి గోవిందరాజులు అన్నారు. శనివారం మండల పరిధిలోని గగ్గలపల్లి జెడ్పిహెచ్‌ఎస్ పాఠశాల ఆవరణలో ప్రధానోపాధ్యాయురా లు హరిప్రియ అధ్యక్షతన నిర్వహించిన సభా కార్యక్రమానికి డిఈఓ గోవిందరాజులు, సర్పంచ్ సత్యనారాయణ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జెఎస్‌ఆర్ ఫౌండేషన్ వ్య వస్థాపక అధ్యక్షుడు, గగ్గలపల్లి వాస్తవ్యులు జమ్ము ల సతీష్ రెడ్డి మాట్లాడుతూ గ్రామాభివృద్ధికి తన వంతు సహాయం అందిస్తానని, పాఠశాల గ్రామానికి దూరంగా ఉన్నందున పాఠశాలకు రక్షణ కోస ం గ్రామస్తులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల కోరిక మేరకు తన వంతు కర్తవ్యంగా సిసి కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

ముందు ము ందు పాఠశాలకు అవసరమైన సహకారం అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు. అనంతరం పాఠశాల ఎస్‌ఎంసి చైర్మెన్ రామస్వామి, గ్రామ యువకులు జయకృష్ణ, డిఎస్‌ఓ కృష్ణా రెడ్డి, లయన్స్ క్లబ్ హైదరాబాద్ ఎవరెస్ట్ అధ్యక్షులు బుచ్చన్న మాట్లాడుతూ పాఠశాలలో పదవ తరగతిలో పది జిపిఎ తెచ్చుకున్న విద్యార్థులకు ఉచితంగా కళాశాల విద్యను అం దిస్తామని హామీ ఇచ్చారు. రామకృష్ణ వివేకానంద వెల్ఫేర్ అసొసియేషన్ అధ్యక్షులు మాట్లాడుతూ అ నేక స్వచ్ఛంద సంస్థల ద్వారా పాఠశాల అభివృద్ధికి సహకరించగలనని తెలిపారు.

జెఎస్‌ఆర్ ఫౌండేష న్ అధ్యక్షులు సతీష్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదువుకుని అభివృద్ధి చెందితే పాఠశాల తరగతి గదులన్నింటికీ డిజిటలైజేషన్ చేయిస్తానని హా మీ ఇచ్చారు. డిఈఓ గోవిందరాజులు మాట్లాడు తూ రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్ పాఠశాలలకు దీ టుగా ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్య అం దించడంతో పాటు విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పిస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి కృషి చేస్తుందన్నారు. పాఠశాల అభివృద్ధికి గ్రామస్తులు బాగా స హకరిస్తున్నారని గ్రామస్తులను అభినందించారు. విద్యారు-్థలు బాగా చదవాలని, జిల్లా విద్యాభివృద్ధి లో ఉపాధ్యాయులందరికీ రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు ఎం. నాగరాజు, బంధం పరమేశ్వర ప్రసాద్, అనంత రామశర్మ, సత్యనారాయణ, పి. అశోక్, కె. విజయలక్ష్మి, సంధ్యారాణి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News