Wednesday, January 22, 2025

ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య

- Advertisement -
- Advertisement -

కొత్తకోట : ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య లభిస్తుందని జిల్లా పరిషత్ వైస్ చైర్మెన్ వామన్ గౌడ్ అన్నారు. మండల పరిధిలోని కనిమెట్ట ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు స్కూల్ డ్రెస్సులు పంపిణీ చేసే కార్యక్రమానికి జెడ్పి వైస్ చైర్మెన్ వామన్ గౌడ్, ఎంపిపి గుంత మౌనికలు ముఖ్య అతిథులుగా హాజరై విద్యార్థులకు స్కూల్ డ్రెస్‌లను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలకు పూర్వ వైభవం తీసుకురావడం జరిగిందన్నారు.

ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య అందించడంతో పాటు స్కూల్లో చక్కటి వాతావరణం వచ్చే విధంగా పచ్చని చెట్లు, విశాలమైన మైదానాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రైవేట్ పాఠశాలలో తమ పిల్లలను చేర్పించకుండా ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలని తల్లిదండ్రులకు సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గాదం రాణి, బీమ్ రెడ్డి, గాడిల ప్రశాంత్, మాజీ వైస్ ఎంపిపి గుంత మల్లేష్, కృష్ణయ్య గౌడ్, పరమేష్, కృష్ణ కుమార్, మన్నెకొండ శ్రీనివాస రెడ్డి, వెంకటేష్, కురుమన్న, రాము, రవి, హెచ్‌ఎం లక్ష్మయ్యతో పాటు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News