Wednesday, January 22, 2025

ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్యను అందించాలి

- Advertisement -
- Advertisement -

పెద్దపల్లి: పాఠశాలలోని చివరి విద్యార్థి వరకు నాణ్యమైన విద్యను అందించేందుకు ఉపాధ్యాయులు, విద్యా వ్యవస్థ నిరంతరం కృషి చే యాలని జిల్లా కలెక్టర్ సంగీత సత్యనారాయణ అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన విద్యా దినోత్సవ వేడుకల్లో జిలా ్ల కలెక్టర్ సంగీత సత్యనారాయణ, ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డిలు పా ల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన టీఎల్‌ఎం మేళాను పరిశీలించా రు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. మన ఊరు మన బడి కింద చేపట్టిన పాఠశాలల అభివృద్ధి పనులు, రాష్ట్ర ఏర్పడిన తర్వాత విద్యా రంగంలో సాధించిన విజయాలను వివరిస్తూ వీడియో ప్రదర్శన తిలకించారు.

అనంతరం విద్యా ప్రగతిని వివరించే నివేదిక చదివి వినిపించారు. గత 9 ఏళల పాలనలో ప్రభుత్వం మౌళిక సదుపాయాలను అభివృద్ది చేస్తూ విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన అందించేందుకు పటిష్ట చర్యలు చేపట్టిందన్నారు. రెసిడెన్షియల్ గురుకుల విద్యాలయాల ద్వారా ప్రైవేటుకు దీటు గా ప్రభుత్వ పాఠశాలల్లో అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్నామని తెలిపారు. అనంతరం 10వ తరగతి ఫలితాల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థుల ను సన్మానించాలని లిస్ట్ తయారు చేస్తే 68 మంది విద్యార్థులు ఉండటం సం తోషకరమన్నారు. మన ఊరు మన బడి ద్వారా 21 పాఠశాలలను విద్యా ది నోత్సవం రోజున ప్రారంభించుకున్నామని, విద్యార్థులకోసం లైబ్రరీ ఏర్పాటు చేశామని తెలిపారు. తొలి మెట్టులో భాగంగా ఉపాధ్యాయులకు శిక్షణ అందిస్తున్నారని, వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్దవహిస్తూ విద్యపట్ల వారికి ఆసక్తి పెరిగేలా వినూత్నంగా కృషి చేయాలని కలెక్టర్ ఉపాధ్యాయులకు సూ చించారు.

ప్రభుత్వ విద్యాలయాల్లో మౌళిక వసతుల కల్పనలో ప్రభుత్వం ముందుందని, అప్పటి, ఇప్పటికి విద్యా వ్యవస్థలో అనేక మార్పులు వచ్చాయ ని ఎమ్మెల్యే దాసరి మరోహర్‌రెడ్డి తెలిపారు. అనంతరం విధి నిర్వహణలో ఉ త్తమ ప్రదర్శన కనబరిచిన అధ్యాపకులకు, జూనియర్ కళాశాల లెక్చరర్లకు, ఉపాధ్యాయులను సన్మానించారు. 10వ తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులు 68 మందికి ప్రశంసా పత్రాలతోపాటు కలెక్టర్ కాలేజ్ బ్యాగ్‌ను అందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ కుమార్ దీ పక్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ రఘువీర్‌సింగ్, మున్సిపల్ చైర్మెన్ దాసరి మ మత, జడ్పీటీసీ బండారి రామ్మూర్తి, జూలపల్లి జడ్పీటీసీ బొద్దుల లక్ష్మణ్, పా లకుర్తి జడ్పీటీసీ కందుల సంద్యారాణి, జిల్లా విద్యాశాఖ అధికారి మాధవి, జి ల్లా ఇంటర్మీడియల్ నోడల్ అధికారి కల్పన, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ లక్ష్మీనర్సయ్య, అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News