Friday, November 22, 2024

కార్పొరేట్ స్థాయిలో వసతులతో నాణ్యమైన విద్య

- Advertisement -
- Advertisement -

మల్దకల్ : మండల పరిధిలోని ఎల్కూర్ గ్రా మంలో మండల పరిషత్ ప్రాథమికొన్నత పాఠశాలలో మన ఊరు మన బడి కార్యక్రమంలో రూ. 9,81,689లతో చేపట్టిన అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి హాజరయ్యారు. అనంతరం మన ఊరు మన బడి పాఠశాల భవనంను రిబ్బన్ కటింగ్ చేసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో గత ప్రభుత్వాలు విద్యకు సరైన ప్రాధాన్యత కల్పించలేకపోయారని, ఈ ప్రాంతం నుంచి విద్యార్థులు కర్నూలు హైదరాబాద్ వంటి ప్రాంతాలలో వెళ్లి విద్యను అభ్యసించేవారని, గట్టు మండలంలో అక్షరాస్తులు వెనకబడి ఉన్న గతంలో సరైన పాఠశాలలో ఉపాధ్యాయులు లేక విద్యార్థులు ఉన్న ఇబ్బందులను ఎదుర్కొనేవారన్నారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత సిఎం కెసిఆర్ నేతృత్వంలో విద్యారంగానికి ప్రభుత్వం వి ద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎ స్సీ, ఎస్టీ, బీసీ 119 మైనార్టీ గురుకాలలను స్థాపించి, కార్పొరేట్ స్థాయిలో వసతులతో, నాణ్యమైన విద్యను పౌష్టికాహారంతో కెజి టూ పిజి ఉచిత విద్య అందించే దిశగా సర్కార్ అడుగులు వే స్తుందన్నారు. ప్రభుత్వ పాఠశాలలో కూడా ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం బోధన ప్రారంభించడంతో విద్యార్థుల నమోదు సంఖ్య పెరుగుతుందన్నారు.

గురుకులాల్లో చదివిన విద్యార్థిని విద్యార్థులు భవిష్యత్తు లో అత్యున్నత స్థాయిలో ఎదగాలని మంచి ప్రభుత్వ ఉద్యోగం సాధించే విధంగా కృషి చేయాలని వారికి ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. గ్రామాలోని తల్లిదండ్రులు ప్రతి ఒక్కరూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చదివి ంచాలని కోరారు.

ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ జంబు రామన్‌గౌడ్, ఎంపిపి రాజారెడ్డి, మండలం రైతు బంధు సమితి అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు వెంకటన్న, సర్పంచ్ రాధలీల, మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు వెంకటేశ్వర్‌రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు, సింగిల్‌విండో వైస్ చైర్మన్ విష్ణు, మండల కో ఆప్షన్ నంబర్ హైదర్ , జిల్లా విద్యాధికారి , మండల విద్యాధికారి, విద్యా కమిటీ చైర్మన్ , బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు చక్రంరెడ్డి, అజయ్, నర్సింహారెడ్డి, ఆంజనేయులు, నారాయణ, అంజనేయులు, మండల పార్టీ యూత్ అధ్యక్షుడు ప్రవీణ్, బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యూత్ సభ్యులు పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News