Friday, November 22, 2024

మన ఊరు-మన బడితో నాణ్యమైన విద్య

- Advertisement -
- Advertisement -

యాదాద్రి భువనగిరి : తెలంగాణలో నాణ్యమైన విద్యను అందించాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం భువనగిరి మండలం అనాజిపురం గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పత్తితో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించారు.

అనంతరం విద్యార్థుల తరగతి గదుల్లో డిజిటల్ క్లాస్ ప్రారంభించి పాఠశాల ఏకరూప దుస్తులు పాఠ్య పుస్తకాలు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి మాట్లాడుతూ పేద, మధ్యతరగతి విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను చేరువ చేయాలనే సంకల్పంతో కార్యక్రమం ముందుకు సాగుతోందన్నారు. పాఠశాలల అభివృద్ధి విద్యార్థుల భవిష్యత్‌కు బాటలు వేసినట్లు అవుతుందన్నారు. పాఠశాలలపై పెట్టేది ఖర్చు కాదని, పెట్టుబడి మాత్రమేనని అన్నారు.విద్యతో పాటు వారి ఆరోగ్య విషయంలో కూడా ప్రభుత్వం శ్రద్ద వహిస్తుందని విద్యార్థులకు బలమైన పోషకాల కోసం మధ్యాహ్న భోజనంతో పాటు రాగిజావ కుడా అందజేస్తుందన్నారు.

ఈకార్యక్రమంలో జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేందర్ రెడ్డి, గ్రంథాలయ చైర్మన్ జడల అమరేందర్ గౌడ్, రైతు సమితి అధ్యక్షులు అమరేందర్, జిల్లా విద్యాశాఖాధికారి నారాయణరెడ్డి, ఎంపీపీ నరాల నిర్మల వెంకటస్వామి, జడ్పీటిసి సుబ్బూరు బీరు మల్లయ్య, మున్సిపల్ వైస్ చైర్మన్ చింతల కిష్టయ్య, మండల పార్టీ అధ్యక్షులు జనగాం పాండు, పీఏసిఎస్ వైస్ చైర్మన్ కేతావత్ మహేందర్ నాయక్, సర్పంచ్ ఏదనూరి ప్రేమలత మల్లేశం, జెక్క కవిత రాఘవేందర్ రెడ్డి, కేశవపట్నం రమేష్, మంజూనాయక్, వెంకటేష్, బాత్క అశోక్, కేశవరావు, ఓం ప్రకాష్ గౌడ్, సుధాకర్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News