Wednesday, January 22, 2025

మన ఊరు – మన బడితో నాణ్యమైన విద్య

- Advertisement -
- Advertisement -
  • ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి

మంచాల: తెలంగాణలో నాణ్యమైన విద్యను అందించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కెసిఆర్ మన ఊరుమనబడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని బిఆర్‌ఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం మండల పరిధిలోని నోముల, మంచాల, చిత్తాపూర్, ఆరుట్ల, బండాలేమూర్, లోయపల్లి తదితర గ్రామాల్లో ఘనంగా విద్యా దినోత్సవం నిర్వహించారు.

నోముల గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి పాల్గొని మన ఊరుమనబడి కార్యక్రమంలో భాగంగా చేపట్టిన అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద, మధ్యతరగతి విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను చేరువ చేయాలనే సంకల్పంతో కార్యక్రమం ముందుకు సాగుతోందన్నారు. పాఠశాలల అభివృద్ధి విద్యార్థుల భవిష్యత్‌కు బాటలు వేసినట్లు అవుతుందన్నారు.

గ్రామ అభివృద్ధికి రూ.25 లక్షలు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం విద్యార్థులకు యూనిఫామ్స్, బుక్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డివో వెంకటాచారి, మార్కెట్ కమిటీ చైర్మన్ పుల్లారెడ్డి, ఎంపిపి జాటోత్ నర్మద, పిఎసిఎస్ చైర్మన్ పుల్లారెడ్డి, తహసీల్ధార్ అనిత, ఎంపిడివో శ్రీనివాస్, డిఈ అబ్బాస్, బిఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షులు చీరాల రమేష్, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ దండేటికార్ రవి, సర్పంచ్‌లు పల్లాటి బాల్ రాజు, అనిరెడ్డి జగన్ రెడ్డి, బొడ్డు నాగరాజు గౌడ్,  ప్రధానోపాధ్యాయులు సత్తారి రాజిరెడ్డి, ఎస్‌ఎంసి చైర్మన్ పల్లాటి జగన్, బిఆర్‌ఎస్ ఎస్సి సెల్ మండల అధ్యక్షుడు నల్ల ప్రభాకర్, యువజన విభాగం మండల ప్రధాన కార్యదర్శి గంట విజయ్ కుమార్, పాఠశాల దాత ముత్యాల హరికిషన్, వార్డు సభ్యులు లావణ్య, సుకుణమ్మ, వెంకట్ రెడ్డి, చింతకింది విరేష్, సునీత, ఎర్ర నవనీత, గ్రామ కోఆప్షన్ సభ్యులు నల్ల సునీత తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News