Tuesday, December 24, 2024

రైతులకు నాణ్యమైన ఎరువులను విక్రయించాలి

- Advertisement -
- Advertisement -

చిగురుమామిడి: రైతులకు నాణ్యమైన ఎరువులను విత్తనాలను విక్రయించాలని హుస్నాబాద్ ఎమ్మెలేఓ్య ఓడితెల సతీష్ కుమార్ తెలిపారు. గురువారం కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం సుందరగిరి గ్రామంలో మాజీ ఎంపిపి తాడూరి కిష్టయ్య ఏర్పాటు చేసిన ఫర్టిలైజర్ షాపును ఎమ్మెల్యే సతీష్ కుమార్ ముఖ్య అతిథిగా హజరై ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫర్టిలైజర్ షాపును రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం గుర్తింపు పొందిన మందులను, విత్తనాలను మాత్రమే క్రయ విక్రయాలు జరపాలని రైతులను సూచించారు. అనంతరం ఎమ్మెల్యే సతీష్ కుమార్‌ను శాలువా కప్పి ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో ఎంపిపి కొత్త వినిత శ్రీనివాస్ రెడ్డి, జెడ్పిటిసి సభ్యులు గీకురు రవీందర్, స్థానిక సర్పంచ్ శ్రీమూర్తి రమేష్, సింగిల్ విండో చైర్మన్ జంగా వెంకటరమణ రెడ్డి, హుస్నాబాద్ మార్కెట్ యార్డు వైస్ చైర్‌పర్సన్ రామోజి రజిత కృష్ణమాచారి, సింగిల్ విండో వైస్ ప్రెసిడెంట్ కరివేద మహేందర్ రెడ్డి, ఎంపిటిసి సభ్యులు మెడబోయిని తిరుపతి, నాయకులు పెద్దపల్లి అరుణ్ కుమార్, గాగిరెడ్డిపల్లి సర్పంచ్ సన్నీల వెంకటేశం, ఉప సర్పంచ్ జంగ శ్రీనివాస్ రెడ్డి, బిఆర్‌ఎస్ నాయకులు సాంబారి కొమురయ్య, మంకు శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News