Sunday, January 19, 2025

నిమ్స్‌లో లుకేమియా వ్యాధిగ్రస్తులకు నాణ్యమైన వైద్య సేవలు:  డైరెక్టర్ బీరప్ప

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ హైదరాబాద్: నగరంలోని నిమ్స్ ఆస్పత్రిలో నిమ్స్‌లో లుకేమియా వ్యాధిగ్రస్తులకు నాణ్యమైన వైద్య సేవలు:  డైరెక్టర్ బీరప్ప వ్యాధిగ్రస్తులకు నాణ్యమైన వైద్యం అందిస్తున్నట్లు డైరెక్టర్ నగరి బీరప్ప తెలిపారు. శుక్రవారం క్రానిక్ మైలాద్ లుకేమియా దినోత్సవం సందర్భంగా ఆసుపత్రి లెర్నింగ్ సెంటర్‌లో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో మెడికల్ ఆంకాలజీ డిపార్ట్ మెంట్ హెడ్ సదాశివుడుతో కలిసి హాజరై ఈ సందర్భంగా మాట్లాడుతూ లుకేమియా వచ్చిందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రస్తుతం సాంకేతికత తో సరైన సమయంలో వైద్యం తీసుకుంటే సంపూర్ణ ఆరోగ్యం సొంతం చేసుకోవచ్చని బోన్మారో లాంటి చికిత్సలతో వ్యాధిని నియంత్రించే వెసులుబాటు ఉందన్నారు.

అనంతరం మెడికల్ ఆంకాలజీ హెడ్ ఆఫ్ ది డిపార్ట్ మెంట్ సదాశివుడు ప్రసంగిస్తూ సీఎంఎల్ దినోత్సవాన్ని ప్రతి ఏటా నిర్వహిస్తామన్నామని ఇందులో వస్తున్నమార్పులతో పాటు దీనిపై మరింత విస్తృతంగా రోగులకు అవగాహన కల్పించేందుకు ఉపయోగపడుతుందని చెప్పారు. తొలి దశలోనే ఈ వ్యాధిని గుర్తిస్తే మందులతో పూర్తిగా నయం చేవచ్చని తెలిపారు. క్రమం తప్పకుండా జాగ్రత్తలు, కొన్ని నెలల పాటు మందులను వాడితే ఆ తర్వాత పూర్తిగా మందులను వాడాల్సిన అవసరం ఉండదన్నారు. నిమ్స్ కి వచ్చే రోగులకు అన్ని సౌకర్యాలు కల్పించడంతో పాటు వేగంగా వైద్యం అందేలా ప్రత్యేక చొరవ తీసుకుంటున్నామని తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News