Monday, December 23, 2024

మున్సిపాలిటీ ద్వారా నాణ్యమైన సేవలందించాలి

- Advertisement -
- Advertisement -

వనపర్తి : మున్సిపాలిటీ ద్వారా ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. వనపర్తి జిల్లా కేం ద్రంలో నూతనంగా నిర్మించిన పురపాలక శాఖ భవనాన్ని బుధవారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకుని పౌరులకు సేవలు అంది ంచాలన్నారు. వన పర్తి జిల్లా ఏర్పాటు చేసినప్పుడు ఎస్పి కార్యాలయం కోసం పురపాలక సంఘం భవ నం కేటాయించడం జరిగిందని, నూతన ఎస్పి కార్యాలయా నిర్మాణం పూర్తై ప్రారంభించిన నేపథ్య ంలో తిరిగి పురపాలక సంఘానికి భవనం అప్పగించామన్నారు.

పునరుద్ధరణ పనులు చేపట్టి పురపా లక సంఘానికి ఆధునిక సాంకేతిక వసతులు సమకూర్చడం జరిగిందని అన్నారు. ప్రజలు పురపాలక సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అంతకు ముందు నూతన మున్సిపల్ భవనంలో వాస్తూ పూజా, రుద్ర హోమం మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్ దంపతులు, స్థానిక కౌన్సిలర్ నందిమ ల్ల భువనేశ్వరి దం పతులు నిర్వహించారు. మార్కెట్ కమిటీ చైర్మెన్ పలుస రమేష్ గౌడ్, మున్సిపల్ వై స్ చైర్మన్ వాకిటి శ్రీధర్, కౌన్సిలర్లు కాగితాల లక్ష్మినా రాయణ, పుట్టపాకల మహేష్, నాగన్న యా దవ్, చీర్ల సత్యం, నక్క రాములు, నారాయణ, జంపన్న యాదవ్, రమాదేవి, పద్మ, మంజుల, అలేఖ్య, భారతి, మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహారెడ్డి, మున్సిపాలిటీ ఇంజనీర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News