Saturday, December 21, 2024

ఇళ్ల నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలి

- Advertisement -
- Advertisement -

కంటోన్మెంట్ : డబుల్ ఇళ్ల నిర్మాణంలో ప్రమాణాలు పా టించాలని మల్కాజ్‌గిరి పార్లమెంట్ ,కంటోన్మెంట్ అసెంబ్లీ ఇంచార్జీ మర్రిరాజశేఖర్‌రెడ్డి అన్నారు. బుధవారం కంటోన్మెంట్ రెండవవార్డు పరిధిలోని రసూల్‌పూర నారయణ జోపిడి సంఘం సిల్వర్ కౌంపౌండ్ వద్ద నిర్మిస్తున్న డబుల్ బెడ్‌రూం ఇళ్లను స్థానిక నేతలతో కలిసి ఆయన పర్యవేక్షించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… పేదల ఆత్మగౌరవ ప్రతీకగా నిర్మిస్తు న్న డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని త్వరితగతిన ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని అధికారులను అదేశించారు.

అదే విధంగా రసూల్‌పురాలో ఉన్నటువంటి నాలాలకు ప్రహరీలను ఏర్పాటు చేసి రాబోవు వర్షాకాలంలో ముప్పునకు గురికాకుండా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ చైర్మన్ టిఎన్.శ్రీనివాస్, బిఆర్‌ఎస్ నేతలు ముప్పిడి మధుకర్, ప్రవీణ్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News