Monday, January 20, 2025

ఆర్జీయూకేటీ యూనివర్సిటిలోని మెస్‌లో గంధరగోళం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ బాసర : బాసర ట్రిపుల్ ఐటీలో శక్తి క్యాటరింగ్ సర్వీసెస్ మెస్‌లో సిబ్బంది ఘర్షణ పడ్డారు. గురువారం రాత్రి భోజన సమయంలో మెస్ మేనేజర్, సూపర్ వైజర్ మధ్య గొడవ చోటుచేసుకుంది. భోజనానికి వచ్చిన విద్యార్థుల ఎదుటే ఇద్దరు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. దీంతో విద్యార్థులు ఆందోళనకు గురై డైనింగ్ హాల్ నుంచి పరుగులు తీశారు. ఘర్షణలో ముఖాలకు తీవ్రగాయాలై రక్తస్రావం జరగడంతో క్యాంపస్ ఆస్పత్రికి తరలించారు.

అయితే ఘటనపై స్పందించేందుకు యూనివర్సిటి అధికారులు నిరాకరించారు. ఈ ఘర్షణపై బాసర ఎస్‌ఐ మహేష్‌ను సంప్రదించగా ఎలాంటి సమాచారం లేదని ఫిర్యాదు అందలేదని తెలిపారు. బాసర ట్రిపుల్ ఐటీలో శక్తి మెస్‌లో పనిచేసే విజయన్, పర్యవేక్షకుడు ప్రసాద్ మధ్య ఘర్షణ జరిగిన మాట వాస్తవమేనన్నారు. స్థానిక ఆసుపత్రిలో చికిత్స చేయించి పంపించామని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News