Wednesday, January 22, 2025

కుటుంబ కలహాలతో మహిళ ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

చేగుంట: తల్లి కూతుళ్ల మద్య కలహాలతో మనస్థాపం చెంది రైలు కింద పడి మహిళ ఆత్మ హత్య చేసుకున్న సంఘటన మెదక్ జిల్లాలోని చేగుంట మండలం వడియాం రైల్వే స్టేసన్‌లో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యు లు తెలిపిన వివరాల ప్రకారం… చేగుంట మండల కేంద్రానికి చెందిన పెండ్యాల భాగ్య(30) గత 10 సంవత్స రాల క్రితం కోడురూ మండలం రామంచకు చెందిన రాజుతో వివాహం జరగగా 3 సంవత్సరాల క్రితం బాగ్యను రాజు వదిలి వెళ్లి పోవడంతో ఆమె తన తల్లి దగ్గర ఉంటూ కూలీ పనులు చేసుకుంటూ తన ముగ్గురు పిల్లలను పోషించుకుంటుంది.

తల్లితో చిన్న పాటి గొడవతో మన స్థాపం చెంది ఇంటి నుంచి వెళ్లిపోయి వడియారం రైల్వే స్టేషన్ గేట్ సమీపంలో రైలు కింద పడి ప్రాణాలు తీసుకుంది. అటు తండ్రి లేక ఇటు తల్లి ఆత్మహత్య చేసుకో వడంతో ముగ్గురు పిత్తలు అమృత, అర్చన, ఆకిష్ లు అనాధలు అయ్యారు. కామారెడ్డి రైల్వే పోలీసులు వచ్చి కేసు నమోదు చేసుకుని శవాన్ని కామిరెడ్డి ఆసుపత్రికి తరలించి పోస్టు మార్టం చేయిస్తున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News