Monday, December 23, 2024

క్వీన్ ఎలిజబెత్ 2 అంత్యక్రియలు.. జో బైడెన్ సీటుపై ట్రంప్ ఎగతాళి

- Advertisement -
- Advertisement -

Queen Elizabeth 2 funeral: Trump mocked Joe Biden's seat

లండన్ : లండన్ లోని విండ్సర్ క్యాజిల్‌లో సోమవారం జరిగిన ఎలిజబెత్2 అంతిమ సంస్కారాల కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఆయన సతీమణికి 14 వ వరుసలో సీట్లు కేటాయించడంపై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు. ఈ అంత్యక్రియలకు వివిధ దేశాల నుంచి 500 మంది దేశాధినేతలతోపాటు 2 వేల మంది అతిధులు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ట్రంప్ తన సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్ మీడియాలో బైడెన్ ఫోటోను పోస్టు చేసి వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. … “కేవలం రెండేళ్ల లోనే అమెరికా పరిస్థితి ఎలా మారిందో చూడండి.

ప్రపంచ వేదికపై అమెరికాకు గౌరవం దక్కలేదు. ఒకవేళ నేను అధ్యక్షుడిగా ఉంటే వారు నన్ను ఇలా వెనుక వరుసల్లో కూర్చోబెట్టేవారు కాదు. మనదేశం కూడా ఇప్పుడున్న దానికంటే చాలా భిన్నంగా ఉండేది. రియల్ ఎస్టేట్ అయినా, రాజకీయాలైనా, జీవితమైనా, లొకేషన్ అనేది చాలా ముఖ్యం ”అని ఎగతాళి చేశారు. క్వీన్ ఎలిజబెత్2 అంత్యక్రియలు సెప్టెంబర్ 19న లండన్‌లో జరిగాయి. ఈ కార్యక్రమానికి ప్రపంచ దేశాల నేతలు, యూరోపియన్ ఫ్యామిలీ మెంబర్స్ హాజరయ్యారు. బ్రిటన్‌ను సుదీర్ఘకాలం మహారాణిగా పాలించిన ఎలిజబెత్‌కు తుది వీడ్కోలు పలికారు. క్వీన్ అంతిమ సంస్కారాలకు ముందు జో బైడెన్ రాణి కుటుంబీకులకు తన సంతాపం తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News