Friday, December 20, 2024

ప్లాటినం వేడుకకు రాలేకపోయిన క్వీన్

- Advertisement -
- Advertisement -

Queen Elizabeth To Miss Friday Jubilee Thanksgiving Service

 

లండన్ : అనారోగ్య కారణాలు, అలసటతో క్వీన్ ఎలిజబెత్ ప్లాటినం జూబ్లీ థ్యాంక్స్‌గివింగ్ కార్యక్రమానికి హాజరుకాలేకపొయ్యారు. సెయింట్ పాల్ కెథెడ్రాల్‌లో అట్టహాసంగా ఈ కార్యక్రమాలకు ఏర్పాట్లు జరిగాయి. రాజరికపు సింహాసనాన్ని అధిరోహించి 70 ఏండ్లు పూర్తవుతున్న దశలో దేశవ్యాప్తంగా అట్టహాసంతో ఉత్సవాలు ఏర్పాట్లు జరిగాయి. చారిత్రక ప్రదేశాలకు రంగుల విద్యుదీపాలతో ముస్తాబులు చేశారు. ఎలిజబెత్ 2 ఘక్వీన్ ఈ దశలో అత్యంత కీలకమైన కవాతు, ఇతర ఉత్సవాలను తిలకించాల్సి ఉంది. అభివాదం చేయాల్సి ఉంది. అయితే 96 సంవత్సరాల రాణి గురువారం అస్వస్థతకు గురయ్యారని బకింగ్‌హాం రాజభవనం అధికారులు తెలిపారు. రాజకుటుంబ సభ్యులతో కలిసి ఆమె రెండు సార్లు బాల్కనీ నుంచి ప్రదర్శనకు అభివాదాలు చేయాల్సి ఉంది. కొవ్వొత్తులు వెలిగించాలి. అయితే అశక్తత కారణంగా వీటికి ఆమె దూరంగా ఉన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News