Friday, November 22, 2024

క్వీన్ ఎలిజబెత్‌ ద్వారా చారిత్రక ఘట్టం

- Advertisement -
- Advertisement -

Queen may appoint new UK PM in Scotland in historic first

స్కాట్లాండ్‌లో బ్రిటన్ ప్రధాని నియుక్త వేడుక

లండన్ : వయోవృద్ధ నేత ఎలిజబెత్ 2 తొలిసారిగా చారిత్రక ఘట్టాన్ని నిర్వహించనున్నారు. బ్రిటన్ కొత్త ప్రధాని నియామకపు సంప్రదాయక వేడుక క్వీన్ సారధ్యంలో స్కాట్లాండ్‌లోని తమ బాల్‌మోరల్ రాజప్రాసాదంలో జరుపుతారని ది సన్ పత్రిక తెలిపింది. అనారోగ్యంతో క్వీన్ కదలలేని స్థితిలో ఉన్నారు. అయితే ఇప్పుడు ఆమె తమ వార్షిక వేసవి సెలవులకు స్కాట్లాండ్‌కు వెళ్లారు. బ్రిటన్ నూతన ప్రధాని ఎన్నిక వచ్చే నెల 5న జరుగుతుంది. ప్రధానిగా విజేత అయిన వారు స్కాట్లాండ్‌కు వెళ్లి రాణిని లాంఛనంగా కలుస్తారు.

రిషి సునాక్ లేదా లిజ్ ట్రస్‌ల మధ్య ప్రధాని పదవికి పోటీ తుది దశకు చేరింది. క్వీన్ పర్యటన ప్రముఖులు ఆమెను కలిసేందుకు వెళ్లడం తేదీలు సమయం అంతటిని భద్రతా కారణాలతో రహస్యంగానే ఉంచారు. సాధారణంగా దేశ ప్రధానిగా ఎన్నికయ్యే వారు సాధారణంగా లండన్‌లోని రాణి నివాసం బకింగ్‌హామ్ ప్యాలెస్‌కు కానీ ఆగ్నేయ ఇంగ్లాండ్‌లోని విండ్సర్ కాజిల్‌కు కానీ వెళ్లి క్వీన్‌ను కలుసుకోవడం జరుగుతుంది. అక్కడనే ఆమె ఆశీస్సులు తీసుకుంటారు. అయితే చరిత్రలో తొలిసారిగా ఇందుకు భిన్నంగా రాణి విడిది చేసి ఉన్న స్కాట్లాండ్‌లో ఈ ఘట్టం జరుగుతుందని వెల్లడైంది. బోరిస్ జాన్సన్ తరువాత దేశ ప్రధాని అయ్యే నేత తరాలుగా వస్తున్న క్వీన్ హస్తాన్ని ముద్దాడే ప్రక్రియ తొలిసారిగా లండన్ లేదా విండ్సర్ వెలుపల జరిపేందుకు నిర్ణయం జరిగింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News