- Advertisement -
లండన్: బ్రిటన్ రాణి ఎలిజెబెత్2 ఈ ఏడాది జూన్‌లో అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌కు ఆతిథ్యం ఇవ్వనున్నట్టు ది సండే టైమ్స్ తెలిపింది. జి7 దేశాల సదస్సుకు ముందు ఈ ఆతిథ్య కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నది. ఆ కార్యక్రమంలో రాజ దంపతుల వారసులు ప్రిన్స్ చార్లెస్, ఆయన భార్య క్యామిల్లా, ఇంకా ఇతర కుటుంబసభ్యులు కూడా హాజరు కానున్నారు. యుకె, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, అమెరికాతో కూడిన జి7 దేశాల సదస్సు జూన్ 11 నుంచి 13 వరకు బ్రిటన్‌లోని ఆగ్నేయ తీర ప్రాంతం కార్న్‌వాల్‌లో జరగనున్నది. ఈ సదస్సుకు ప్రధాని మోడీ కూడా అతిథి హోదాలో హాజరు కానున్నారు. 94 ఏళ్ల ఎలిజెబెత్2 కరోనా విజృంభణతో తన మకాంను ఇంగ్లండ్ ఆగ్నేయ ప్రాంతంలోని విండ్‌సర్ కోటకు మార్చారు. ఇప్పటికే టీకాలు తీసుకున్న రాజ దంపతులు జి7 సదస్సు వరకల్లా లండన్‌లోని రాజప్రసాదానికి తిరిగి రానున్నట్టు చెబుతున్నారు.
- Advertisement -