Monday, December 23, 2024

ఆప్ ఆధ్వర్యంలో కోర్టుకు క్యూనెట్ బాధితులు

- Advertisement -
- Advertisement -

ముషీరాబాద్: నిరుద్యోగులను మోసం చేసిన క్యూ నెట్ కంపెనీ కార్యకలాపాలను నిషేదించాలని, ఆ కంపెనీ యా జమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని క్యూనెట్ బాధితుల జేఏసీ కన్వీనర్, ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్ డిమాండ్ చేశారు. తాము పెట్టిన పెట్టుబడులను తిరిగి ఇప్పించాలని కోరుతూ రాష్ట్రంలోని బాధితులు హైదరాబాద్ సిటీ క్రిమినల్ కో ర్టును ఆశ్రయించనున్నట్టు ఆయన చెప్పారు. ఈ సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం ఆప్ కన్వీనర్ డాక్టర్ ది డ్డి సుధాకర్, ప్రముఖ న్యాయవాది డాక్టర్ సోలొమన్ రాజు బృందం శనివారం కౌన్సిలింగ్ నిర్వహించారు.

ఈ కౌన్సిలింగ్‌కు సుమారు 300 మంది బాధితులు హజరయ్యారు. అనంతరం డాక్టర్ దిడ్డి సు ధాకర్ మాట్లాడుతూ కోట్లాది రూపాయల క్యూనెట్ భారీ కుం భకోణం కేసులో హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు స్పందించి తక్ష ణమే విచారణ జరిపి క్యూనెట్ అధికా రులను అరెస్టు చేయడం అభినందనీయం అని అన్నారు. క్యూనెట్ యాజమాన్యాన్ని కూడా అరెస్టు చేసి, బ్యాంకు లావాదేవీలను స్తంభింపజేసి బాధి తులకు వాళ్ల పెట్టుబడులను వాపసు ఇప్పించాలన్నారు.

అనేక ఇబ్బందులు పడుతున్న బాధితులకు సత్వర న్యాయం కోసం హైదరాబాద్ సిటీ క్రిమినల్ కోర్టులో ఇంప్లీడ్ పిటీషన్‌ను దాఖలు చేస్తున్నట్టు ఆయన చెప్పారు. ప్రముఖ న్యాయవాది డాక్టర్ సోలొమాన్ రాజు మా ట్లాడుతూ క్యూ నెట్ బాధితుల వద్ద ఎలాంటి ఫీజులు తీసుకో కుండా ఉచితంగా న్యాయ సేవలను అందజేస్తున్నట్టు తెలిపారు. కా ర్యక్రమంలో మాథ్యూ, సుందర్ జేమ్స్, ఎం. వేణు, ఆప్ నేతలు జా వీద్, షరీఫ్, ఎండీ మజీద్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News