Tuesday, April 15, 2025

సమాజానికి ఉపయోగపడే అద్భుతమైన సినిమా

- Advertisement -
- Advertisement -

అభ్యుదయ దర్శకుడు బాబ్జీ రూపొందించిన లేటెస్ట్ ఎంటర్‌టైనర్ ‘పోలీస్ వారి హెచ్చరిక’!. తూలికా తనిష్క్ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాత బెల్లి జనార్థన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా ఆడియో లాంచ్ ఈవెంట్ ని అతిధుల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ..‘సమాజంలో జరిగే చెడులను ప్రశ్నించే సినిమాలు రావాలి. ఈ సినిమా కూడా అలాంటి కోవకే చెందిన సినిమా. గతం లో ఎన్టీఆర్, సూపర్ స్టార్ కృష్ణ, మోహన్ బాబు లాంటి నటులు ఎర్ర జెండాను పట్టుకొని కమ్యూనిస్ట్ అంశాలతో చక్కటి సందేశాత్మక చిత్రాలు తీశారు. ఆ సినిమాలను జనాలు ఎంతగానో ఆదరించారు. ఇప్పుడు బాబ్జీ అలాం టి ఆశయాలతో ఈ సినిమా చేశారు’ అని అన్నారు.

జయసుధ మాట్లాడుతూ.. ‘బాబ్జి చాలా అద్భుతమైన డైరెక్టర్.. ఇప్పుడు వాళ్ళ అబ్బాయితో ఈ సినిమా తీశా రు. సినిమా కంటెంట్ చాలా బాగుంది. ఈ సినిమా పా టలు విన్నాను. వినసొంపుగా చాలా బాగున్నాయి. ఈ సినిమా కచ్చితంగా పెద్ద హిట్ అవుతుందని భావిస్తున్నా ను’ అని తెలిపారు. ఆర్ నారాయణ మూర్తి మాట్లాడు తూ.. ‘ప్రజా నాట్యమండలి వేదిక నుంచి వచ్చిన బాబ్జీ తీసిన ఈ సినిమా గురించి విన్నప్పుడు ఇది సమాజానికి ఉపయోగపడే అద్భుతమైన సినిమా అని అర్థమయ్యింది. ఇలాంటి సినిమాలు ఇంకా ఎన్నో రావాలి. ఈ సందేశాత్మక చిత్రం ఘన విజయం సాధించాలి’ అని తెలియజేశా రు. ఈ కార్యక్రమంలో అజయ్ ఘోష్, సిపిఐ ఎంఎల్‌ఎ కూనంనేని సాంబశివ రావు ఎంఎల్‌సి సత్యం, సిపిఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాన్ వెస్లీ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News