Monday, January 13, 2025

ప్రశ్నా పత్రం

- Advertisement -
- Advertisement -

ఎగరేసిన గాలి పటం
ఏ రంగుదో గుర్తు లేదు.
అనుభూతులు అనుభవాలు
రూపం లేని జ్ఞాపకాల చిత్రాలు.
పీలికలైన పదాల మూటలో
ఇమడని భావాలు
కొడిగట్టిన నిరీక్షణ
వెలుగుల కరచాలనమవుతుందా?
నీవాకిట్లో నా హృదయాన్ని
ఒక్కసారి తట్టి చూడు.
శేషప్రశ్నగా మిగిలిన
ప్రశ్నాపత్రం గాలిలో
రెపరెపలాడుతోంది

అవును నేను వసంతాన్ని
చిగురించడం విరబూయడమే
తెలిసినదాన్ని
మురిసిపోవడం తప్ప
ముడుచుక పోవడం తెలియని దాన్ని
ప్రవాహానికి ఎదురీదినప్పుడే
మంచో చెడో ఫలితం వచ్చేది
అలుపు లేకుండా గెలుపు మొక్కలు
నాటినప్పుడే నువ్వేమిటో నిరూపించుకునేది
ఉదయాలను ఆహ్వానించి నపుడే
కాలంతో కలిసి స్నేహం చేసేది
సముద్ర గంభీరాన్ని కొలిచే గొలుసువు అయితే కదా నీ గుండె గట్టి పడేది
ఎడారిలో సుఖాల కోసం
ఎదురు చూడను గానీ
తడి లేని జీవితాలతో
ముగింపు పలకాలని లేదు నా ఒడిలో చల్లని వెన్నెల కురుస్తుందా
జీవితాన?
వసంత నెల్లుట్ల

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News