Saturday, November 23, 2024

సింగరేణి పరీక్షలో స్టడీ సెంటర్ నిర్వాకం

- Advertisement -
- Advertisement -

Question Paper Leaked for Junior Assistant Exam

అభ్యర్థుల నుంచి 25లక్షలు వసూలు
గోవాలో పరీక్ష పోలీసుల విచారణ?,
అభ్యర్థుల వివరాల సేకరణ
పకడ్బందీగా పరీక్ష : కన్వీనర్

మన తెలంగాణ/హైదరాబాద్ : సింగరేణి జూనియర్ అసిస్టెంట్ పరీక్షకు సంబంధించిన ప్రశ్నాపత్రం లీక్ చేసి పరీక్షను రాయించిన వ్యవహారంపై పోలీసుల దర్యాప్తు ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం జరిగిన జూనియర్ అసిస్టెంట్ పోస్టుల పరీక్షలకు ఓ స్టడీ సెంటర్ నిర్వాహకుడు అభ్యర్థుల నుంచి రూ. 25 లక్షలు వసూలు చేసినట్టు పోలీసులు గుర్తించారు. డబ్బులు ఇచ్చిన అభ్యర్థులతో సదరు స్టడీ సెంటర్ నిర్వాహకుడు గోవాలో పరీక్షలు రాయించినట్టు పోలీసుల ప్రాధమిక విచారణలో తేలింది. మూడు పరీక్షల సెట్‌లతో అభ్యర్థులు పరీక్షలు రాశారని, ఈ స్కామ్‌లో ముగ్గురు సింగరేణి అధికారులకు సంబంధం ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. పరీక్ష పేపర్‌కు లీకేజీకి సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు గోవాకు వెళ్లిన అభ్యర్థుల వివరాలను సేకరిస్తున్నట్టు తెలిపారు. ప్రస్తుతం స్టడీ సెంటర్ నిర్వాహకులు పరారీలో ఉన్నాడని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు వివరించారు.

పకడ్బందీగా నిర్వహించాం: కన్వీనర్

మన తెలంగాణ/హైదరాబాద్: సింగరేణి జూనియర్ అసిస్టెంట్ రాత పరీక్షలను అత్యంత పారదర్శకంగా, పకడ్భందీగా నిర్వహించామని పరీక్షల నిర్వహణ కన్వీనర్, జెఎన్‌టియూహెచ్ డైరెక్టర్ విజయ్‌కుమార్ రెడ్డి వెల్లడించారు. ఆదివారం సాయంత్రం సింగరేణి కాలరీస్ డైరెక్టర్ (పర్సనల్) ఎస్.చంద్రశేఖర్, జిఎం (రిక్రూట్‌మెంట్) కె.బసవయ్యలతో కలిసి ఆయన సంయుక్తంగా పత్రికా ప్రకటన జారీ చేశారు. సింగరేణి పరీక్షను తాము అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు ఆయన వివరించారు. ప్రశ్నపత్రం తయారీ నుంచి అత్యంత గోప్యతను పాటించామని విజయ్‌కుమార్ రెడ్డి తెలిపారు. అలాగే పరీక్షకు హాజరైన 77,907 మంది అభ్యర్థుల ఓఎంఆర్ షీట్లను, పరీక్షకు హాజరు కానీ అభ్యర్థుల ప్రశ్న పత్రాలను, ఓఎంఆర్ షీట్లను పోలీసు బందోబస్తు మధ్య స్ట్రాంగ్ రూంకు తరలించామన్నారు. పరీక్షకు హాజరు కాని 20,975 అభ్యర్థుల సంఖ్యకు ఇవి మ్యాచ్ అయినట్లు స్పష్టం చేశారు. ఇన్విజిలేటర్ల ఎంపికను కూడా లాటరీ పద్ధతిలో కేటాయించామని ఆయన తెలిపారు.

మోసగాళ్ల మాయమాటలను విశ్వసించ వద్దు: డైరెక్టర్

సింగరేణి జూనియర్ అసిస్టెంట్ రాత పరీక్ష సజావుగా జరిగిందని, ఈ విషయంలో మోసగాళ్ల మాయమాటలను, సామాజిక మాధ్యమాల్లో వచ్చే తప్పుడు వార్తలను విశ్వసించ వద్దని డైరెక్టర్ (పర్సనల్, ఆపరేషన్స్) ఎస్.చంద్రశేఖర్ కోరారు. నోటిఫికేషన్ జారీ చేసినప్పటి నుంచి పరీక్ష పూ ర్తయ్యే వరకు సింగరేణి విజిలెన్స్ విభాగం అప్రమత్తంగా వ్యవహారించిందన్నారు. ఇప్పటికీ ఎవరైనా ఈ పరీక్షల విషయంలో మాయమాటలు చెప్పి నా, మోసం చేయాలని చూసినా వారి సమాచారాన్ని కచ్చితమైన ఆధారాలతో విజిలెన్స్ విభాగానికి 9491145075 లేదాvig@scclmines.com కు మెయిల్ ద్వారా వారి వివరాలను పంపించాలన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News