Wednesday, January 22, 2025

ప్రశ్నించడం తెలంగాణ రక్తంలోనే ఉంది: కవిత

- Advertisement -
- Advertisement -

నిజామాబాద్: ఎన్నికలను అషామాషీగా తీసుకోవద్దని ఎంఎల్‌సి కవిత సూచించారు. విద్యార్థులు, కొత్త ఓటర్లతో ఎంఎల్‌సి కవిత ఇంటరాక్ట్ అయ్యారు. యువతలో చైతన్యం రావాలని పిలుపునిచ్చారు. ఎన్నికలు బ్రహ్మ పదార్థం అని, తమకు సంబంధం లేదనుకోవద్దని సూచించారు. ప్రశ్నించడం తెలంగాణ రక్తంలోనే ఉందని చెప్పారు. ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరు ఓటు వేయాలని పిలుపునిచ్చారు. దేశం అభివృద్ధి చెందాలంటే యువత ఓటింగ్‌లో భాగస్వామ్యం కావాలని కోరారు. పట్టణాల కంటే గ్రామాల్లో ఓటింగ్ శాతం ఎక్కువగా ఉంటుందని కవిత పేర్కొన్నారు. ప్రైవేటు రంగంలో 30 లక్షల ఉద్యోగాలు కల్పించామని తెలియజేశారు. స్టార్టప్‌లను తెలంగాణ ప్రభుత్వం పోత్సహిస్తోందని, స్టార్టప్‌లలో ఉత్పత్తుల పరిశీలనకు టీ వర్క్, ఏర్పాటు చేశామన్నారు. ఐడియాతో వచ్చి ఉత్పత్తితో బయటకు వెళ్లేలా టి హబ్‌ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. స్టార్టప్‌లకు ఎలాంటి గ్యారంటీ లేకుండా రెండు కోట్ల రూపాయల వరకు రుణాలు ఇస్తున్నామని కవిత చెప్పారు. నిజామాబాద్‌లో ఐటి హబ్‌కు రాయితీలు ఇచ్చామన్నారు. ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటి రంగాన్ని విస్తరిస్తున్నామన్నారు. జాబ్ మేళాలతో వేల మంది ఉద్యోగ అవకాశాలు కల్పించామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News