- Advertisement -
అమరావతి : రెండో రోజు ఎపి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ప్రశ్నోత్తరాలతో రెండో రోజు ఉభయ సభలు ప్రారంభం కానున్నాయి. శాసన సభలో పారిశ్రామికాభివృద్ధి, పెట్టుబడులు, కడప స్టీల్ ఫ్యాక్టరీ, దేవాలయాల కూల్చివేత, కొత్త మెడికల్ కాలేజీలు, వైఎస్సార్ ఆసరా, పక్కా గృహాల నిర్మాణం, పారిశ్రామిక హబ్‌లు, భూముల మార్పిడి, ఆక్వా రైతుల సంక్షేమం, మద్య నిషేధం, నరేగా పనులపై చర్చ జరగనుంది.
శాసన మండలిలో విద్యా రంగంలో సంస్కరణలు, ఖరీఫ్ సీజన్ నష్టాలు, ఆర్బీకే సేవలు, గోదావరి డెల్టా ఆధునికీకరణ, వైఎస్సార్ యంత్ర సేవా, విద్యుత్ వినియోగంపై సబ్సిడీ, నామినేటెడ్ పదవుల్లో బీసీలు, మహిళలకు రిజర్వేషన్లు, మున్సిపల్ శాఖలో కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపు, ప్రైవేట్, ఆన్-ఎయిడెడ్ విద్యా సంస్థలు, ఎస్సీ వెల్ఫేర్ హాస్టళ్లు స్వల్పకాలిక చర్చ జరగనుంది.
- Advertisement -