Sunday, February 2, 2025

సిపిఎస్ హైస్కూల్‌లో అడ్మీషన్ల కోసం విద్యార్థుల క్యూ

- Advertisement -
- Advertisement -

మధిర : గతంలో అడ్మీషన్ల కోసం అవస్థలు పడిన మధిర సిపిఎస్ హైస్కూల్‌లో ప్రస్తుతం అడ్మీషన్ల కోసం క్యూ కడుతున్నారు. మధిర చుట్టు ప్రక్కల వారంతా చేరుతున్నారు. ఈ విద్యా సంవత్సరం శుక్రవారం వరకు వచ్చిన అడ్మీషన్లు 68 ఇందుకు గల కారణాలు క్రమశిక్షణ విలువలతో బోధన, రాజీ పడకుండా విద్యార్థుల అభ్యున్నతకై నిరంతరం కృషి చేయడం.

గత నాలుగు సంవత్సరాలుగా ఏటా పదవ తరగతి లో 95 పైగా ఫలితాలు సాధించడం గత మూడు సంవత్సరాలుగా ఏటా ఐఐఐటి బాసర సీటు సాధించడం ప్రతి శనివారం ప్రత్యేక సహా పాఠ్య కార్యక్రమాల నిర్వహణ. వసతి గృహ విద్యార్థులకు, దూర ప్రాంతాల విద్యార్థులకు ఆర్టీసీ బస్ సౌకర్యం మన ఊరు – మనబడి ద్వారా నూతన ఆధునిక మరుగుదొడ్లు, నీటి వసతి నూతన విద్యా టెక్నాలజీ ఐఎఫ్‌పి ఎస్ ద్వారా బోధన, బీద విద్యార్థుల దత్త-వారికి విద్యా సౌకర్యాల కల్పన విద్యాపరంగా సకల సౌకర్యాల నిర్వహణ విద్యార్థుల సమగ్ర మూర్తిమత్వ అభివృద్ధికై సిబ్బంది ఉమ్మడి కృషి చేస్తున్నారు.

సాధ్యమయ్యే రీతుల్లో విద్యాపరంగా ఏ విషయంలోనూ రాజీ పడకుండా గుణాత్మక విద్యనందించే కృషి నిరంతరం కొనసాగుతుందని హెచ్‌ఎం డాక్టర్ ప్రభు దయాల్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News