గోషామహల్: నగర ప్రజలకు త్వరితగతిన పౌర సేవలను అందించాలన్న ఉద్దేశంతో సిఎం కెసిఆర్ ఆలోచనల మేరకు వా ర్డు కార్యా లయాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టినట్లు రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. ఈ మేరకు శుక్రవారం హిందీనగర్ స్పోర్ట్ కాంప్లెక్స్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన జాంబాగ్ డివిజన్ వార్డు కార్యాలయాన్ని ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా మహమూద్ అలీ మాట్లాడుతూ గతంలో తమ సమస్యల పరిష్కారానికి ప్రజలు వి విధ ప్రాంతాల్లోని కార్యాలయాల్లో అధికారులను కలిసి ఫిర్యాదు చేయాల్సి వచ్చేదని, ప్రజల సౌకర్యార్థం తెలంగాణ ప్రభుత్వం వార్డు కార్యాలయ వ్యవస్థను ఏర్పాటు చే యడంతో ప్రజా సమస్యల స త్వర పరిష్కారానికి మార్గం మరింత సుగమం అయ్యిందన్నారు.
గ్రేటర్ హైదరాబాద్ ప రిధిలోని ప్రతీ డివిజన్‌లో వార్డు కార్యాలయాన్ని ప్రారంభించి, ప్రజా సమస్యల తక్షణమే పరిష్కంచేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రతి వార్డు కార్యాలయంలో అసిస్టెంట్ మున్సిపల్ కమీషనర్ స్థాయి అధికారి ఇంచార్జిగా వ్యవహరిస్తారని తెలిపారు. ఈ కార్యకమంలో మాజీ ఎమ్మెల్యే ప్రేమ్‌సింగ్ రాథోడ్, గో షామహల్ నియోజకవర్గం బీఆర్‌ఎస్ ఇం చార్జి నందకిశోర్ వ్యాస్, తెలంగాణ ఉద్యమనేత ఆర్వీ మహేందర్‌కుమార్, ఎంఐఎం ఎమ్మెల్సీ రెహమత్ బేగ్, కార్పొరేటర్ రాకేష్ జైస్వాల్, బీఆర్‌ఎస్ నాయకులు పూజావ్యాస్ బి లాల్, ఆనంద్‌గౌడ్, శాంతిదేవి, ఎస్ ధన్‌రాజ్, ఆర్ శంకర్‌లాల్ యాదవ్, ఆవుల వినోద్‌యాదవ్, ఎం. శ్రీనివాస్‌గౌడ్, జి. నందుకుమార్ తదితరులు పాల్గొన్నారు.