Tuesday, January 21, 2025

త్వరితగతిన యాదాద్రి, భద్రాద్రి థర్మల్

- Advertisement -
- Advertisement -

వచ్చే సంవత్సరంలోగా ఒక్క యూనిట్‌లోనైనా
ఉత్పత్తి ప్రారంభం కావాలి: అధికారులకు సిఎండి ప్రభాకర్ సూచన

మనతెలంగాణ/హైదరాబాద్ : యాదాద్రి, భద్రాద్రి థర్మ ల్ పవర్ ప్లాంట్‌లను త్వరితగతిన పూర్తి చేయాలని ట్రా న్స్‌కో, జెన్‌కో సిఎండి ప్రభాకర్ రావు బిహెచ్‌ఈఎల్ డైరెక్టర్‌తో పాటు ఇతర అధికారులకు సూచించారు. వచ్చే సంవత్సరంలోగా ఒక్క యూనిట్‌లోనైనా విద్యుత్‌ను ఉత్ప త్తి చేయాలని సిఎం కెసిఆర్ ఆదేశాలు జారీ చేశారని ఆ దిశగా కృషి చేయాలని ఆయన వారితో పేర్కొన్నారు. హో టల్ తాజ్‌దక్కన్‌లో యాదాద్రి, భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌ల పనుల పురోగతిపై బిహెచ్‌ఇఎల్, టిఎస్ జెన్‌కో అధికారులతో ట్రాన్స్‌కో, జెన్కో సిఎండి ప్రభాకర్ రావు శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశానికి బిహెచ్‌ఈఎల్ డైరెక్టర్‌తో అధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశం అనంతరం ప్రభాకర్ రావు మాట్లాడుతూ హైదరాబాద్‌లో పరిశ్రమల స్థాపనకు 24 గంటల విద్యుత్ సరఫరా ఎంతో అవసరమన్నారు.

అందులో భాగంగా యాదాద్రి, భద్రాద్రి పవర్ ప్లాంట్ పనుల పురోగతిపై బిహెచ్‌ఈఎల్, టిఎస్ జెన్‌కో అధికారులతో సమీక్ష జరిపామని ఆయన తెలిపారు. ఈ సమావేశానికి బిహెచ్‌ఈఎల్ డైరెక్టర్ మర్ధస్ కూడా వచ్చారని ఆయనతో పాటు ఇతర అధికారులందరూ హాజరయ్యారని సిఎండి తెలిపారు. వచ్చే సంవత్సరం లోగా యాదాద్రి పవర్ ప్లాంట్‌లోని రెండు యూనిట్స్ 800 మెగా వాట్స్ కమిషన్ చేయాలని, దీంతోపాటు ఒక్క యూనిట్‌ను కూడా అనుసంధానం చేయాలని బిహెచ్‌ఈఎల్ అధికారులను కోరామని సిఎండి ప్రభాకర్‌రావు తెలిపారు. వచ్చే రెండు సంవత్సరాల్లో మిగతా వాటిని కూడా అనుసంధానం చేయాలని వారికి సూచించామన్నారు. సిఎం కెసిఆర్ ఈ రెండు ప్లాంట్లను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారని అందులో భాగంగానే ఈ రోజు సమావేశాన్ని నిర్వహించామని ఆయన తెలిపారు. సమావేశాకి సంబంధించిన నివేదికను సిఎం కెసిఆర్ అందజేస్తానని ఆయన తెలిపారు.

ప్రభుత్వం సహకారం ఉంది

బిహెచ్‌ఈఎల్ డైరెక్టర్ మర్ధస్ మాట్లాడుతూ కెటిపిఎస్, వైటిపిఎస్ పనుల పురోగతి గురించి సిఎండి ప్రభాకర్‌రావు సమీక్ష చేశారన్నారు. కరోనా వలన పనులు కొంత ఆలస్యం అయ్యాయని ఆయన తెలిపారు. రానున్న రోజుల్లో పనులు వేగవంతం చేస్తామని, అనుకున్న సమయానికి మొదటి యూనిట్‌ను అనుసంధానం చేస్తామన్నారు. త్వరలోనే అన్ని పనులు పూర్తి చేస్తామని ఆయన పేర్కొన్నారు. కెటిపిఎస్‌లో కొన్ని పనులు పెండింగ్‌లో ఉన్నాయని వాటిని త్వరగా పూర్తి చేయడానికి తాము ప్రయత్నం చేస్తామని ఆయన తెలిపారు. తమకు టిఎస్ జెన్‌కోతో పాటు ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉందని ఆయన పేర్కొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News