Monday, December 23, 2024

ఎజి ఆఫీసు కాంప్లెక్సులో ఆడిట్ వారోత్సవాల్లో భాగంగా క్విజ్ కాంపిటేషన్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : ఆడిట్ వారోత్సవాల్లో భాగంగా గురువారం ఎజి ఆఫీసు కాంప్లెక్స్‌లో ముగింపు కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా క్విజ్ కాంపిటేషన్, కల్చరల్ ఈవ్‌నింగ్ కార్యక్రమం నిర్వహించారు. గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ఈ నెల 20న ఆడిట్ వారోత్సవాలను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ వారోత్సవాలు నేటితో ముగిశాయి.

ముగింపు కార్యక్రమంలో పలు అంశాలపై ప్రేక్షకులు ఐఎ అండ్ ఎండి చరిత్ర, జనరల్ అవేర్నెస్‌పై ప్రశ్నోత్తరాల సెషన్ జరిగింది. ఐఎ అండ్ ఎడి అధికారులు, వారి కుటుంబాల కోసం సాంస్కృతిక సాయంత్రం పేరుతో సాంస్కృతిక కార్యక్రమాలు ఉల్లాసంగా, వినోదాత్మకంగా జరిగాయి. నృత్య ప్రదర్శనలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. అనేక స్కిట్స్ ప్రదర్శించారు. ఈ సందర్భంగా నిర్వహించిన హెల్త్ క్యాంపును ఎంఎస్ సుబ్రహ్మణ్యం ప్రారంభించారు. ఈ హెల్త్ క్యాంపులో అధికారులు పేరు నమోదు చేసుకున్నారు. ఆరోగ్యంపై అవగాహన కల్పించినందుకు డైరెక్టర్ జనరల్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించిన రక్తదాన శిబిరంలో మొత్తం 81 యూనిట్ల రక్తాన్ని సేకరించారు.

Health Camp

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News