Tuesday, November 5, 2024

విద్యార్థుల ప్రతిభను గుర్తించడానికి క్విజ్‌పోటీలు దోహదం

- Advertisement -
- Advertisement -

కాచిగూడ : విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను గుర్తించి, అందులో నైపుణ్యాన్ని పెంపొ ందించడానికి క్విజ్ పోటీలు ఎంతగానో దోహదపడుతాయని పిసిసి ప్రధాన కార్యదర్శి కోట నీలిమ అన్నారు. 18ఏళ్లు నిండిన యువత ఉచి తంగా ఈ పోటీల్లో పాల్గొనవచ్చని తెలిపారు. బుధవారం నారాయణగూడలోని ఆర్‌బివిఆర్ రెడ్డి కాలేజీలో యూత్ ఆన్‌లైన్ క్విజ్ పోటీదారుల పేర్ల నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు.పేర్ల నమోదు కార్యక్రమంలో విద్యార్థులు పెద్ద సంఖ్యలో తమ పేర్లను నమోదు చేసుకున్నారు. అనంతరం కోట నీలిమ మాట్లాడుతూ.. సామాజిక న్యాయం, సమ్మిళిత అభివృద్ధి, సాధికారత కోసం పాటుపడిన మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ నుంచి యువ భారతీయులు ప్రేరణ పొందడానికి ఈక్విజ్ పోటీలను నిర్వ హిస్తున్నామని తెలిపారు. జంటనగరాలలోని అన్ని డిగ్రీ, పిజి కాలేజీల్లో పేర్ల నమోదు చేపట్టామని ఆమె పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News