Monday, December 23, 2024

ఐదేళ్లలో అక్కడ ఉన్నవారు కోటీశ్వరులు: సజ్జల

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఎవరు ఏమనుకున్నా ఆరు నెలల్లో ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేస్తామని, అన్ని సౌకర్యాలతో ఏ ప్రభుత్వం ఇప్పటి వరకు పేదలకు ఎలాంటి లేఔట్లు ఇవ్వలేదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి తెలిపారు.  ఆర్ 5 జోన్‌లోని కృష్ణాయపాలెం లేఅవుట్‌ లో  ఇళ్ల నిర్మాణాల పనుల పురోగతిని మంత్రులు జోగి రమేష్, మేరుగ నాగార్జున, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ పరిశీలించారు. అనంతరం వెంకటాయ పాలెంలో సీఎం సభ ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం సజ్జల మీడియాతో మాట్లాడారు. ఐదేళ్లలో ఇక్కడ ఉన్న వారందరూ కోటీశ్వరులు కావడం ఖాయంగా కనిపిస్తోందన్నారు. ప్రజాధనం దుర్వినియోగం చేయటం లేదని పేదలకు ఇళ్ళు ఇవ్వటాన్ని ఎవరైనా ఎలా తప్పు పడతారా? అని అడిగారు. మా ప్రశ్న ఒక్కటే.. ఇళ్ళ స్థలాలను ఎందుకు ఇస్తారు? మొక్కలు పెంచటానికా? మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పినట్లు సమాధుల కోసమా? అని సజ్జల ఎద్దేవా చేశారు.

Also Read: ఇండియా-పాక్ మ్యాచ్ కోసం ఆస్పత్రి బెడ్స్: అహ్మదాబాద్‌లో అడ్వాన్స్ బుకింగ్స్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News