Wednesday, March 12, 2025

అతను లేకపోతే భారత్ గేమ్ మరోలా ఉండేది: అశ్విన్

- Advertisement -
- Advertisement -

12 సంవత్సరాల కలను సాకారం చేస్తూ.. ఈ ఏడాది జరిగిన ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీని భారత్ జట్టు అందుకుంది. టోర్నమెంట్ మొత్తంలో అత్యద్భుత ప్రదర్శన కనబరుస్తూ.. ఛాంపియన్‌గా నిలిచింది. ఈ విజయంలో జట్టులో ఉన్న ప్రతీ ఆటగాడు కీలక పాత్ర పోషించాడు. అయితే టీం ఇండియా మాజీ స్పిన్నర్ అశ్విన్ మాత్రం ఓ ఆటగాడిపై ప్రశంసల వర్షం కురిపించారు. ఆ ఆటగాడు లేకుంటే భారత్ పరిస్థితి మరోలా ఉండేదని ఆయన అభిప్రాయపడ్డారు. అతను మరెవరో కాదు.. యువ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి.

‘ఈ సిరీస్‌లో వరుణ్ ఆడిన మ్యాచ్‌లు తక్కువే అయినా.. ప్రభావం మాత్రం గట్టిగా చూపించాడు. అతను లేకపోతే.. భారత్ పరిస్థితి మరోలా ఉండేది. నేను జడ్జినైతే.. ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డును వరుణ్‌కే ఇచ్చేవాడిని’’ అని అశ్విన్ పేర్కొన్నారు. ఇక న్యూజిలాండ్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో వరుణ్ ఐదు వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత ఆసీస్‌తో జరిగిన సెమీస్‌లోనూ అతను అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఇక న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో రెండు వికెట్లు తీసి.. జట్టు విజయంలో తన వొంతు సహాయం అందించాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News