Sunday, February 23, 2025

వచ్చే ఏడాది నుంచి టాలీవుడ్ ఫిలిం అవార్డ్

- Advertisement -
- Advertisement -

ఆర్ కె.కళా సాంసృతిక ఫౌండేషన్ ద్వారా ప్రతి సంవత్సరం ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు చేపడుతున్న ఆర్.కె.రంజిత్ టాలీవుడ్ ఫిలిం అవార్డ్‌ను హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో ఘనంగా ప్రారంభించారు. ఈ అవార్డులను సినిమా రంగంలో ఉత్తమ ప్రతిభను కనబరచిన వారికి అందించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో దైవజ్ఞ శర్మ, దర్శకులు సముద్ర, జస్టిస్ డా.బి.మధు సూదన్, తెలంగాణ ఫిలిం ఛాంబర్ అధ్యక్షులు ప్రతాని రామకృష్ణ గౌడ్, హేమలత చౌదరి, నగేష్ నారదాసి, కె.యల్ నరసింహారావు, మూస అలీ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్.కె.రంజిత్ మాట్లాడుతూ “దేశంలో సైమా అవార్డ్, ఫిలింఫేర్ ఈ అవార్డ్స్ లాంటివి ఉన్నాయి. కానీ మన తెలుగు సినిమాకు సంబందించిన కళాకారులకు ఇవ్వడానికి ఒక అవార్డు అంటూ లేదు కాబట్టి టాలీవుడ్ ఫిలిం అవార్డులను ప్రారంభించడం జరిగింది. వచ్చే సంవత్సరం నుండి తెలుగు ఇండస్ట్రీలో ఉత్తమ ప్రదర్శన కనబరచిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు ఈ అవార్డులను ప్రధానం చేయడం జరుగుతుంది”అని అన్నారు.

R K Ranjit begins Tollywood Film Awards in Prasad Lab

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News