Sunday, December 22, 2024

13న పార్లమెంట్ ముట్టడి : ఆర్.కృష్ణయ్య

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : జనాభా ప్రకారం బిసి రిజర్వేషన్లను విద్యా, ఉద్యోగ రంగాలలో, చట్ట సభలలో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 13న ఛలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు రాజ్యసభ సభ్యుడు, జాతీయ బిసి సంఘం అధ్యకులు ఆర్. కృష్ణయ్య తెలిపారు. ఆదివారం నగరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఢిలీల్లో చేపట్టే పార్లమెంట్ ముట్టడి, ఆందోళన కార్యక్రమాలకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్నాటక, ఒరిస్సా రాష్ట్రాల నుంచి పెద్ద యెత్తున బిసి ప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు. రిజర్వేషన్లపై విధించిన గరిష్ట పరిమితి 50 శాతంనూ సుప్రీం కోర్టు తొలగించినందున ఎలాంటి న్యాయపరమైన, రాజ్యాంగపరమైన అవరోధాలు లేనందున బిసి/ ఎస్సీ/ఎస్టీ రిజర్వేషన్లను జనాభా ప్రకారం పెంచాలని కోరారు.

వైసిపి రెండేళ్ల క్రితమే పార్లమెంట్‌లో బిసి బిల్లు పెట్టారు. ఈ బిల్లుకు మద్దతుగా 14 పార్టీలు మద్దతు ఇచ్చారని గుర్తుచేశారు. చట్టసభల్లో బిసిలకు 50 శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని, బిసి ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. సమావేశంలో జాతీయ కన్వీనర్ గుజ్జకృష్ణ, నీల వెంకటేష్, సుధాకర్, నర్సింహారావు, కిరణ్ మాదిగ, గొల్లపల్లి దయానంద, సైదులు, అనంతయ్య, గండేటి శంకర్, రాజ్ కుమార్, బిసి నాయకులు, ఉద్యోగ సంఘ నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News