Wednesday, January 22, 2025

బిసిలకు 50 శాతం టికెట్లు ఇచ్చిన వారికే మద్దతు..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బిసిలకు 50 శాతం టికెట్లు ఇచ్చిన వారికే బిసిలు మద్దతిస్తారని జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షులు, ఎంపి ఆర్. కృష్ణయ్య స్పష్టం చేశారు. అన్ని రాజకీయ పార్టీలు బిసి డిక్లరేషన్ ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. బుధవారం హైదరాబాద్ బిసి భవన్ లో 54 కులా సంఘాల నాయకుల సమావేశం జరిగినది. ఆంధ్రప్రదేశ్ బిసి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఎన్ మారేష్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఆర్. కృష్ణయ్య ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతి జిల్లాను ఒక యూనిట్ గా తీసుకొని 50% ఎంఎల్‌ఎ టికెట్లను బిసిలకు కేటాయించాలని కృష్ణయ్య కోరారు.

అన్ని పార్టీలు తమ మేనిఫెస్టోలో విధివిధానాలను తెలియజేయాలన్నారు. బిసిలకు 50 శాతం అసెంబ్లీ టికెట్లు ఇచ్చిన పార్టీని మాత్రమే బిసిల పార్టీగా గుర్తిస్తామని తెలిపారు. బిసి లందరూ పార్టీలకు అతీతంగా ఏకతాటిపైకి వచ్చి తమ బలాన్ని తెలియజేయాలన్నారు. బిజెపి ప్రభుత్వం ఇప్పటికైనా బిసి వ్యతిరేక భావన విడనాడాలని బిసి బిల్లుకు మిగతా పార్టీల మద్దతు కూడగట్టాలని లేదంటే బిజెపి పార్టీని బీసీలంతా బహిష్కరించాలని పిలుపునిస్తామని హెచ్చరించారు. స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటుతున్న బిసిల జీవన ప్రమాణాలు మెరుగు పడటం లేదని బిసిలకు రాజ్యాధికారం అందని ద్రాక్ష లాగే మిగులుతుందని బిసి ఉద్యోగులకు ప్రమోషన్ లో రిజర్వేషన్లు లేక తీవ్ర అన్యాయం జరుగుతోందని వీటన్నిటికీ పరిష్కారం చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లతోనే సాధ్యపడతాయని చెప్పారు.

ఎపి సిఎం జగన్‌మోహన్ రెడ్డి ఇటీవల కుల గణన నిర్వహిస్తామని చెప్పటం చెప్పిన మాటకు కట్టుబడి కులగణనకు అధ్యయన కమిటీ వేయడాన్ని బిసి సంఘాలన్నీ పెద్ద ఎత్తున స్వాగతిస్తూ హర్షం వ్యక్తం చేస్తున్నామని ఆర్ కృష్ణయ్య అన్నారు. మహానాడు సందర్భంగా చంద్రబాబు నాయుడు చెప్పిన మాయమాటలను బిసి కులాలు ఎవరు నమ్మే పరిస్థితిలో లేరని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గుజ్జ కృష్ణ, నీల వెంకటేష్, అంజి, పి.సుధాకర్, సి. రాజేందర్, రామ కృష్ణ, అనంతయ్య, సుశీల తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News