Sunday, December 22, 2024

బిసి జాబితాలోని అన్ని కులాలకు రూ. లక్ష ఆర్థిక సహాయం ఇవ్వాలి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : 14 బిసి కులాలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని బిసి జాబితాలోని 130 కులాలకు వర్తింప చేయాలని జాతీయ బిసి సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. బిసి జాబితాలోని అన్ని కులాలకు, కుల వృత్తులు ఉన్నాయని, ముఖ్యంగా పద్మశాలి, ముదిరాజ్, గౌడ, యీడిగ, గొల్ల, కురుమ, మున్నురుకాపు, బెస్త, బోయ, వాల్మీకి, బలిజ, లింగాయత్ తదితర 130 కులాలకు కూడా లక్ష రూపాయలు పథకాన్ని అమలు చేయాలని సంఘం అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బిసి కార్పొరేషన్ కు విడుదల చేసిన రూ. 100 కోట్లు బడ్జెట్ ఏ మూలకు సరిపోతుందని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలోని 62 లక్షల బిసి కుటుంబాలు ఉన్నాయని.

అందరికీ సబ్సిడీ రుణాలు ఇవ్వడానికి 10 వేల కోట్లు బడ్జెటు ఇవ్వాలని కోరారు. రద్దు చేసిన జిల్లా బిసి కార్పొరేషన్ ఈడీ – పోస్టులు వెంటనే పునరుద్దరించి భర్తీ చేయాలని కోరారు.బిసి కమిషనర్ పోస్ట్ ను వెంటనే భర్తీ చేయాలని కోరారు. బిసి, ఎంబిసి కార్పొరేషన్లకు చైర్మన్‌లను నియమించాలన్నారు. ఎన్నికల ముందైనా బిసిలకు రుణాలు ఇవ్వడానికి ప్రభుత్వం ముందుకు రావడం హర్షించదగ్గ పరిణామమని అన్నారు. ఈ రుణాలు ప్రతి బిసి కుటుంబానికి ఇవ్వాలన్నారు. ముఖ్యమంత్రి ప్రకటించిన బిసి బంధు పథకాన్ని ఇప్పటికైనా వెంటనే అమలు చేయడానికి చర్యలు తీసుకోవాలని కృష్ణయ్య ప్రభత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రతి బిసి కుటుంబానికి రూ. 10 లక్షలు మంజూరు చేయాలన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల ముందు 2018లో సబ్సిడీ రుణాలు ఇస్తామని 5 లక్షల 77 వేల దరఖాస్తులు తీసుకున్నారని,

అవి పెండింగ్‌లో ఉన్నాయని వాటన్నింటికి సబ్సిడీ రుణాలు ఇవ్వాలని కృష్ణయ్య కోరారు. బిసిల మనోభావాలు – గుర్తించి బిసి బంధు పథకం వెంటనే ప్రవేశపెట్టి దశల వారిగా ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయలు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలోబిసి సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శిగా చిటికెల గోవింద, గుజ్జ కృష్ణ, నీల వెంకటేష్, భూపేష్ సాగర్, నందగోపాల్, టి రాజ్ కుమార్, జిల్లపల్లి అంజి, సుధాకర్ వేముల రామకృష్ణ, మోడీ రాందేవ్, నిఖిల్ , తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News