హైదరాబాద్: సామాజిక కోణం విస్మరించకుండా కాంగ్రెస్ ప్రయత్నిస్తుందని పిసిసి మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. బుధవారం పొన్నాల లక్ష్మయ్యతో ఎంపి ఆర్ కృష్ణయ్య సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పొన్నాల మాట్లాడుతూ.. బిసిలకు చట్ట సభల్లో 50 శాతం రిజర్వేషన్లపై చర్చించామని తెలిపారు. బిసి డిక్లరేషన్ లో అన్ని అంశాలు పొందుపరుస్తామని, గతంలో బిసిలకు ఏమి చయలేదో అది చేసే ప్రయత్నం చేస్తామని ఆయన చెప్పారు.
కాంగ్రెస్ పార్టీలో బిసిలకు పెద్ద ఎత్తున సీట్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేసినట్లు ఆర్ కృష్ణయ్య పేర్కొన్నారు. బిసిలకు టిక్కెట్ ఇవ్వకపోతే ప్రజాగ్రహం తప్పదని ఆయన అన్నారు. బిసిలకు తగనన్ని ఎక్కువ సీట్లు ఇవ్వాలని అన్ని పార్టీలపై ఒత్తిడి తెస్తున్నామని చెప్పారు. బిసిల పక్షాణ కాంగ్రెస్ పార్టీలో పొన్నాల లక్ష్మయ్య పోరాడాలని, బిసి డిక్లరేషన్ లో కూడా కొన్ని డిమాండ్లు ఉంచామని ఆర్ కృష్ణయ్య తెలిపారు.