Thursday, January 23, 2025

పంచాయతీ రిజర్వేషన్‌ల్లో బిసి కోటా పెంచాలి

- Advertisement -
- Advertisement -

R Krishnaiah met Minister Errabelli Dayakar Rao

హైదరాబాద్: పంచాయతీరాజ్ రిజర్వేషన్లను 22 శాతం నుంచి 52 శాతానికి పెంచాలని జాతీయ బిసి సంక్షేమ సంఘం ప్రతినిధులు కోరారు. శుక్రవారం రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ను జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ఆధ్వర్యంలో బిసి నేతలతో కలిసి ఆయన చర్చలు జరిపారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి పార్లమెంట్‌లో రాజ్యాంగ సవరణ బిల్లు పెట్టి ఇస్తామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు హామీ ఇచ్చారు. అధికారులను పిలిపించి ప్రధాన మంత్రికి వెంటనే లేఖ రాయాలని మంత్రి ఆదేశించారు.

ముఖ్యమంత్రి కెసిఆర్‌తో మాట్లాడి బిసి రిజర్వేషన్లు పెంచడానికి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ పంచాయతీరాజ్ సంస్థ, స్థానిక సంస్థల ఎన్నికలలో సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం బిసి రిజర్వేషన్లను 34 శాతం నుంచి 22 శాతం తగ్గించారు. 35 సం.లుగా 34 శాతం రిజర్వేషన్లు కొనసాగుతున్నాయి. అప్పుడు లేని అభ్యంతరాలు ఇప్పుడు ఎందుకు అని ఆయన ప్రశ్నించారు. బిసి రిజర్వేషన్లు జనాభా ప్రకారం 34 శాతం నుంచి 52 శాతానికి పెంచాలని డిమాండ్ చేస్తూంటే కోర్టుల తీర్పు ప్రకారం 34 శాతం నుంచి 22 శాతంకు తగ్గించడం న్యాయం కాదన్నారు. ఈ తీర్పును అధిగమించి జనాభా ప్రకారం బిసి రిజర్వేషన్లను 22 శాతం నుంచి 52 శాతానికి పెంచాలంటే రాజ్యాంగ సవరణ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశ పెట్టాలన్నారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి పార్లమెంట్‌లో రాజ్యాంగ సవరణ బిల్లును పెట్టించాలని ఆయన కోరారు. ఈ చర్చలో గుజ్జ కృష్ణ, నీల వెంకటేష్, జి.అనంతయ్య, సి.రాజేందర్, వేముల రామకృష్ణ, చంటిముదిరాజ్, కట్ట బబ్లు గౌడ్, భాస్కర్ ప్రజాపతి, కూనూరు నరసింహగౌడ్, శివకుమార్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News