Wednesday, January 22, 2025

నేను ఆరోగ్యంగానే ఉన్నా : ఆర్.నారాయణ మూర్తి

- Advertisement -
- Advertisement -

సినీరంగంలో పీపుల్ స్టార్ గా పేరొందిన దర్శక నటుడు, నిర్మాత ఆర్ నారాయణ మూర్తి అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆయన్ను హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం ఆయన నిమ్స్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. డాక్టర్ బీరప్ప ఆధ్వర్యంలో ఆర్ నారాయణమూర్తికి అన్ని రకాల వైద్య పరీక్షలు చేయగా ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డాక్టర్లు స్పష్టం చేశారు. బుధవారం ఉదయం ప్రసాద్ ల్యాబ్స్ లో ఆర్ నారాయణమూర్తి ఓ ప్రెస్ మీట్ కు హాజరయ్యారు.

ఆ ప్రెస్ మీట్‌లో నారాయణమూర్తి ఏమీ మాట్లాడలేకపోయారు. తనకు చాలా నీరసంగా ఉందని కళ్లు తిరుగుతున్నాయని నారాయణమూర్తి చెప్పారు. దీంతో ఆయన పక్కనే ఉన్నవారు నారాయణమూర్తిని వెంటనే నిమ్స్ ఆస్పత్రికి తీసుకొని వెళ్లారు. నారాయణమూర్తికి 2 నెలల క్రితమే గుండెకు బైపాస్ సర్జరీ జరిగింది. గుండె నాళాల్లో బ్లాకులు ఉండటంతో బైపాస్ సర్జరీ చేశారు. అప్పటి నుంచి గతంతో పోల్చితే కాస్త మెత్తగానే ఉంటున్నారు.

నేను ఆరోగ్యంగానే ఉన్నాను:ఆర్.నారాయణ మూర్తి

నేను ఆరోగ్యంగానే ఉన్నాను. నా ఆరోగ్యం గురించి అభిమానులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆర్.నారాయణ మూర్తి తెలిపారు. తాను నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నట్లు తెలిపారు. దేవుడి దయవల్ల బాగానే కోలుకుంటున్నానని ఆయన తెలిపారు.

ప్రముఖ నటుడు ఆర్. నారాయణ మూర్తి ఆరోగ్య పరిస్థితిపై నిమ్స్ ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ బీరప్పతో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ చర్చించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం స్థిరంగా ఉందని నిమ్స్ డైరెక్టర్ మంత్రికి వెల్లడించారు . వైద్య పరమైన టెస్టులను చేస్తున్నట్లు మంత్రికి వివరించారు. అనుభవజ్ఞులైన డాక్టర్ల బృందంచే ప్రజానటుడు నారాయణ మూర్తికి మెరుగైన చికిత్సను అందించాలని మంత్రి రాజనర్సింహ నిమ్స్ డైరెక్టర్ కు ఆదేశించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News