- Advertisement -
ప్రముఖ సినీ నటుడు, పీపుల్స్ స్టార్ ఆర్.నారాయణమూర్తి సిఎం రేవంత్‌రెడ్డిని కలిశారు. సోమవారం ఉదయం జూబ్లీహిల్స్‌లోని సిఎం నివాసంలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆర్.నారాయణమూర్తిని సిఎం శాలువాతో సన్మానించారు. అయితే వచ్చే నెలలో గద్దర్ పేరు మీద తెలంగాణ సినీ అవార్డులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గద్దర్ అవార్డుల విధి విధానాలు, నియమ నిబంధనలు, లోగో రూపొందించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలో ఆర్.నారాయణమూర్తి సలహాదారుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో వీరి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.
- Advertisement -