Monday, December 23, 2024

సెన్సార్ కార్యక్రమాల్లో ఆర్ నారాయణ మూర్తి ‘యూనివర్సిటీ’

- Advertisement -
- Advertisement -

పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి స్వీయ దర్శకత్వంలో నటించి నిర్మిస్తున్న చిత్రం యూనివర్సిటీ. ఈ సినిమా ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలను జరుపుకుంటుంది. ఈ సందర్భంగా ప్రసాద్ ల్యాబ్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి మాట్లాడుతూ… ఈ రోజు ప్రపంచం ప్రవేటి కరణ ప్రపంచీ కరణ జరుగుతున్న దశలో భారత్ దేశం లాంటి వర్ధమాన దేశాల్లో లక్షలాది మంది యువత గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ఆశావహ దృక్పధంతో ఎంతో కష్టపడి చదువుతూ డబ్బులు ఖర్చు పెట్టి కోచింగ్ తీసుకొని పరీక్షలకు ప్రిపేర్ అవుతూన్న సమయంలో ఎగ్జామ్ పేపర్ లీకేజీ లు అయిపోతూవుంటే వాళ్ళు కన్న కలలు ఏమైపోవాలి.

వాళ్ళ గమ్యం అగమ్య గోచరం అయిపోతు నిరాశ నిస్పృహలకు లోనై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అలా కాకూడదు. పోలీస్ శాఖ, రైల్వే శాఖా ఇలా అనేక శాఖల్లో ఉద్యోగుల ఎగ్జామ్ పేపర్స్ లికేజ్ అయిపోతున్నాయి. ఎన్నికల్లో రిగ్గింగ్ చేసినట్టు ప్రశ్న పత్రలు లీకేజీ అవుతుంటే విద్యార్థుల భవిష్యత్ ఏమి అవ్వాలి? లంభకోణం చెప్పేవాడు కుంభకోణం చేసుకు పోతూ ఉంటే రెక్కలు తెగిన జ్ఞాన పావురాలు గిల గిల లాడి పోతుంటే ఈ విద్య వ్యవస్థకు అర్ధం ఎక్కడుంది. ప్రభుత్వాలు స్వయం ప్రతిపత్తి కల పబ్లిక్ సర్వీస్ కమిషన్ లాంటివి చాలా అప్రమత్తంగా ఉండాలి. అవకతవకలు జరుగకుండా నిరుద్యోగులకు న్యాయం చేయాలి.అర్హులకు ఉద్యోగాలు ఇవ్వాలి అని చెప్పేదే యూనివర్సిటీ సినిమా .ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.త్వరలో రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేస్తాము అని అన్నారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News