Wednesday, January 22, 2025

మే 26న ఆర్ నారాయణ మూర్తి ‘యూనివర్సిటీ’ మూవీ

- Advertisement -
- Advertisement -

స్నేహ చిత్ర పిక్చర్స్ బ్యానర్ లో పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం యూనివర్సిటీ. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈనెల 26 న రెండు తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ప్రసాద్ ల్యాబ్ లో పాత్రికేయుల కు యూనివర్సిటీ సినిమాను ప్రదర్శించారు. అనంతరం మీడియా సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రెస్ అకాడమీ ఛైర్మెన్ అల్లం నారాయణ, శ్రీనివాస్ , తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాజీ చైర్మన్ ఘంటా చక్రపాణి, ప్రొఫెసర్ లక్ష్మీ నారాయణ, ప్రొఫెసర్ కోయి కోటేశ్వరరావు , తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు లక్ష్మి నారాయణ వారణాసి, తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ వై జే రాంబాబు గారు పాల్గొన్నారు.

చరిత్రలో జరిగిన సంఘటనలు ఇప్పుడు జరుగుతున్నవి చాలా గుర్తుకు వస్తాయి. విద్య వైద్య రంగంలో ఉన్న సమస్యలను కళ్ళకు కట్టినట్టు సినిమా గా తీశారు.. మన వ్యవస్థ లో ఇలాంటి సంఘటనలు జరుగుతువున్నాయి కానీ మనం వ్యతిరేఖించలేక పోతున్నాం.నారాయణ మూర్తి లాంటి వారు మాత్రమే ఇలాంటి సినిమాలు తియ్యగలరు. ఈ సినిమా ఘన విజయం సాధించాలి అని అన్నారు.

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాజీ చైర్మన్ ఘంటా చక్రపాణి మాట్లాడుతూ…..సందేశాత్మక చిత్రం అంటే సామాజిక చైతన్యం, స్పృహ కలిగించే విధంగా వుండాలి. అలాంటి సినిమా ఇది..సమాజంలో జరుగుతున్న సంఘటనల ను సినిమా లో చూపించారు. ఇలాంటి సినిమా రావడం సంతోషం.ఈ సినిమా బాగా ఆడాలి ఆయనకు మంచి పెరు రావాలి. ఇలాంటి సినిమాలు మరెన్నో తీయాలి అని అన్నారు.

ప్రొఫెసర్ లక్ష్మీ నారాయణ మాట్లాడుతూ….విద్యా ప్రవేటికరణ దాని దుష్పరిణామాలు చక్కగా చూపించారు..కోచింగ్ తో పాటు ఉద్యోగాలను ఎలా పక్కదారి పట్టించారో సినిమా లో చూపించారు. ప్రవేటికరణ ద్వారా విద్యను కొంటున్నాం. విద్యని వ్యాపారంగా చూడకూడదు.ఈ సినిమా తీసినందుకు నారాయణ మూర్తి గారికి థాంక్స్ అని అన్నారు.

ప్రొఫెసర్ కోయి కోటేశ్వరరావు మాట్లాడుతూ … 4 దశాబ్దాలుగా ప్రజల సమస్యలను చూపిస్తున్న ఆర్ నారాయణ మూర్తి ని.పీపుల్స్ స్టార్ అంటారు.ఆ పీపుల్స్ స్టార్ అనే పదం ఆస్కార్ కంటే గొప్ప అవార్డ్ అని అనుకుంటున్నాను.ఈ సినిమా ద్వారా అనేక సంఘటనలను మనకు చూపించారు . పాటలు భిన్నంగా వున్నాయి..బడుగు బలహీన వర్గాలు, పాడిత పీడిత వర్గాలకు అండ గా వుంటారు ఆర్ నారాయణమూర్తి.తన సినిమాల ద్వారా చైతన్యాన్ని అందిస్తున్నారు అని అన్నారు.

సీనియర్ జర్నలిస్ట్ అప్పజి మాట్లాడుతూ: యూనివర్సిటీ సినిమా బాగింది. సమాజంలో జరుగుతున్న అక్రమాలు అన్యాయలే ఇతివృత్తలు గా చేసుకొని సినిమాలు తీస్తారు. సినిమా బాగుంది అని అన్నారు.

టీ ఎఫ్ జే ఏ జనరల్ సెక్రెటరీ వై జే రాంబాబు మాట్లాడుతూ : నారాయణ మూర్తి అంటేనే యూనివర్సిటీ.
ఆయన సినిమాలు ఇన్స్పిరేషన్ గా ఉంటాయి.సినిమా సక్సెస్ అవ్వాలి అని కోరుకుంటున్నాను అని అన్నారు.

టీ ఎఫ్ జే ఏ ప్రెసిడెంట్ లక్ష్మీ నారాయణ మాట్లాడుతూ ..నారాయణ మూర్తి గారు సినిమాలు చూస్తూ పెరిగాము.. ప్రజ సమస్యల సంఘటనల తో సినిమాలు తీస్తూ ప్రజల్ని చైతన్య వంతులు చేస్తున్నారు..కాలానికి అనుగుణంగా మారుతున్నారు. పాటలు బాగున్నాయి.సినిమా కూడా మంచి హిట్ అవ్వాలి అని కోరుకుంటున్నాను అని అన్నారు.

ఆర్ నారాయణ మూర్తి మాట్లాడుతూ… పేపర్ లీకేజ్ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో నే కాదు యావత్ దేశంలో చాలా దారుణంగా జరుగుతున్నాయి. గుజరాత్ మధ్యప్రదేశ్ రాజస్థాన్ లో కూడా జరిగాయి. మరి నిరుద్యోగులు ఏమైపోవాలి. విద్య వైద్యం రెండు జాతీయం చెయ్యాలి అని చెప్పేది నా యూనివర్సిటీ సినిమా. లికేజ్ లు జాతీయ సమస్యగా పరిగణించాలి అని రాష్ట్రపతి గారిని ప్రదాని గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ నెల 26న సినిమా రిలిజ్ చేస్తున్నాను. ఇందులో 5 పాటలు ఉన్నాయి. ప్రేక్షకులు సినిమా ని ఆదరించాలి అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News