Monday, December 23, 2024

వాల్మీకుల దీక్షలకు ఆర్‌ఎస్ ప్రవీణ్‌ కుమార్ మద్దతు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/గద్వాల ప్రతినిధి: వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చడంపై మా సంపూర్ణ మద్దతు ఉంటుందని బీఎస్‌పి రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ఐపీయస్ ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్, నడిగడ్డ హక్కుల పోరాట సమితి చైర్మన్ రంజిత్‌కుమార్ అన్నారు. ఐక్య కార్యచరణ కమిటీ పిలుపు మేరకు ధరూర్ వాల్మీకి సంఘం ఆధ్వర్యంలో గద్వాల పట్టణంలో శనివారం వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేస్తూ రిలే నిరాహార దీక్ష చేపట్టారు. వాల్మీకులు చేపడుతున్న నిరాహార దీక్షలో వివిధ పార్టీల నాయకులు పాల్గొన్ని సంపూర్ణ మద్దతు పలికారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ వాల్మీకి బోయలను ఎస్‌టి జాబితాలో చేర్చడం న్యాయబద్దమైన డిమాండ్ చేశారు.

రాజకీయ లబ్ది కోసం ప్రభుత్వాలు వాల్మీకి డిమాండ్‌ను నెరవేరుస్తామని అసెంబ్లీలో తీర్మానం చేసి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చల్లప్పతో కమీషన్ ఏర్పాటు చేసి కేంద్రానికి పంపినట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపినట్లు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం మాత్రం వాల్మీకి బోయల బిల్లులు రాలేదని బహిర్గతం చేస్తున్నారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి బోయలను రాజకీయ లబ్ది కోసం వాడుకోకుండా తమ హక్కును ఎస్టీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వాల్మీకి సంఘం జిల్లా నాయకులు, ధరూర్ మండలం నాయకులు తదితరులు దీక్షలో పాల్గొన్నారు.

R S Praveen Kumar supports to Valmiki Boya Protest

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News