Wednesday, January 22, 2025

నాన్న పాడితే ఎంతో ఇష్టం..

- Advertisement -
- Advertisement -

దేశం గర్వించదగ్గ గాయనీ గాయకులు చాలామంది ఉన్నారు. సౌత్‌లో బాలసుబ్రమణ్యం నుంచి మొదలుపెడితే నార్త్‌లో మహ్మద్ రఫీ వరకు పదుల సంఖ్యలో లెజెండ్స్ లాంటి సింగర్స్ ఉన్నారు. అయితే వీళ్లెవ్వరూ రాశిఖన్నాకు ఇష్టం లేదట. ఆమె మెచ్చిన మొదటి సింగర్, తండ్రి. అవును.. తన తండ్రి పాడితే చాలా ఇష్టమని అంటోంది రాశీఖన్నా. నాన్న మనసుతో పాడతాడని, ఆ ఫీలింగ్ నాకు చాలా ఇష్టమని చెబుతోంది. నాన్న తర్వాత శ్రేయాఘోషల్ గాత్రం అంటే చాలా ఇష్టం అంటోంది ఈ బ్యూటీ. ఈ హీరోయిన్ పరిశ్రమకొచ్చి పదేళ్లయింది. ఆమె నటించిన ఊహలు గుసగుసలాడే సినిమా రిలీజై పదేళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా ఇనస్టాగ్రామ్‌లో ఫ్యాన్స్‌తో చిట్ చాట్ చేసిన రాశిఖన్నా, కొన్ని ఆసక్తికర విషయాలను చెప్పింది. తనకు షారూక్, రణబీర్ అంటే ఇష్టమని చెప్పిన ఆమె తనకు వారి సినిమాలో ఓ చిన్న పాత్ర అయినా ఇవ్వాల్సిందిగా వాళ్లిద్దర్నీ కోరింది. హాలీడేస్ కంటే ప్రతి రోజూ షూటింగ్స్ చేయడం ఇష్టమని రాశి ఖన్నా పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News