Saturday, January 11, 2025

బాలీవుడ్‌లో రాశీ ఖన్నాకు వరుసగా ఆఫర్లు

- Advertisement -
- Advertisement -

అందాల తార రాశిఖన్నా ప్రస్తుతం బాలీవుడ్, కోలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది. కొంతకాలం క్రితం టాలీవుడ్ యంగ్ హీరోల సినిమాల్లో వరుసగా నటించిన ఈ భామ హిందీ, తమిళ్ సినిమాలపై దృష్టి పెట్టింది. ఇక హిందీ సినిమాల్లో ఈ అమ్మడికి వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. యోధ సినిమాతో ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా ఫలితంతో సంబంధం లేకుండా మరో ఆఫర్ ను ఈ అమ్మడు దక్కించుకుంది. ఇక రాశి ఖన్నా ‘ది సబర్మతి రిపోర్ట్’ సినిమా తో మరోసారి హిందీ ప్రేక్షకుల ముందుకు వెళ్లబోతోంది. మొత్తానికి తెలుగులో పెద్దగా ఆఫర్లు లేకున్నా కూడా ఇతర భాషల్లో రాశి ఖన్నా ఆఫర్లు దక్కించుకుంటూ కెరీర్‌లో
ముందుకు సాగుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News