Monday, December 23, 2024

తల్లికి నటి రాశి ఖన్నా కారు కానుక

- Advertisement -
- Advertisement -

Raashii Khanna Gifts Her Mother A BMW 7 series

న్యూఢిల్లీ : ప్రపంచం అంతా జన్మనిచ్చే తల్లిని తల్చుకుంది. ఆదివారం అంతర్జాతీయ మాతృదినోత్సవం నేపథ్యంలో ఎందరో అమ్మలకు జనం గౌరవ వందనాలు అర్పించారు. వీటిలో అత్యంత ప్రత్యేకంగా సినీనటి, గాయని రాశి ఖన్నా తన తల్లికి రూ కోటికి పైగా విలువ చేసే లగ్జరీ కారును కానుకగా అందించింది. పలు సినిమాలతో తీరిక లేకుండా ఉన్న రాశీఖన్నా ఆదివారం మాతృదినోత్సవం నాడు తన స్వస్థలానికి వచ్చింది. తల్లిని విస్మయపరుస్తూ ఎంతో అందంగా మెరిసే కారును కానుకగా ఇచ్చింది. ఆమె కలను బిడ్డగా నెరవేర్చింది. తల్లిదండ్రి విస్తుపోయి చూస్తూ ఉండగా ఆదివారం ప్రిమియం బిఎండబ్లు 740లి కారును వారికి తాళాలు అందించడం ద్వారా కానుకగా చేరవేసింది. ఈ కారు విలువ రూ 1.40 కోట్లు పై మాటే. తల్లికి ముదురు గోధుమ రంగు అంటే ఇష్టమని, దీనిని దృష్టిలో పెట్టుకుని ఈ బ్రౌన్ కారును ఇచ్చినట్లు తెలిపారు. తల్లికి ఇటువంటి కానుక ఇవ్వడం తనకు గర్వకారణం అని, అంతకు మించిన సంతోషం మరోటి లేదని రాశి మురిశారు.

Raashii Khanna Gifts Her Mother A BMW 7 series

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News