Saturday, November 23, 2024

రబీ సాగుకు సిద్ధం.. అన్నదాతల్లో ఆనందం

- Advertisement -
- Advertisement -

అండగా కెసిఆర్ ప్రభుత్వం
15నుంచి రైతుబంధు జమ
కేంద్రం వైఖరిపైనే ఆందోళన

Rabi vari sagu

మన తెలంగాణ/జయశంకర్ భూపాలపల్లి ప్రతినిధి : స్వయంగా రైతు అయిన సి ఎం కెసిఆర్ ఉద్యమ సమయంలో అన్నదాతల కష్టాలను స్వయంగా చూశారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ వెనుకబాటు తనానికి కారణమై న విధానాలను గుర్తించారు. సాగు చేయడానికి నీటి చుక్క దొరకక బీళ్లు భారి ఎండిపోయిన పొలాలు.. పొలాల్లోనే ఉరికొయ్యలకు వేలాడిని అ న్నదాతలను.. పురుగుల మందునే పరమాన్నంగా భావించి తనువు చా లించిన రైతు బిడ్డల బతుకులను చూసి చలించిపోయారు. దీంతో అప్పు డు నీళ్లు, నిధులు, నియామకాలు మావి మాకి కావాలని గొంతెత్తి నినదించారు.

ఉద్యమ విజయంతో తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాక రై తుల సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టిసారించారు. దీంతో అన్నదాతలు ఇప్పుడు ఆనందంతో ఉన్నారు. ప్రభుత్వం సూచించినట్లుగా రబీ సీజన్‌లో ఆరుతడి పంటల సాగుకు సిద్ధమవుతున్నారు. అండగా నిలుస్తున్న కేసీఆర్ ప్రభుత్వానికి మద్దతు తెలుపుతున్నారు. రబీలో వరి సాగుచేయవద్దని కేంద్రం చెబుతుండడంతోనే రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. హనుమకొండ జిల్లాలో రబీ సాగులో 1,98,000 ఎకరాల్లో వివి ధ పంటలు సాగుచేయాలని అధికారులు అంచనా వేశారు. ఇందులో వ రి, మొక్కజొన్న, పత్తి, వేరుశనగ, శనగ, నువ్వులు, పెసర్లు, మినుము లు సాగుచేయాలని నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో ఈ సా రి వరి సాగు సుమారు సగం మేరకు తగ్గనుంది. ఆరు తడి పంటల సా గు ఈసారి భారీగా పెరగనుంది.

రైతు ప్రభుత్వం… టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడగానే సిఎం కేసీఆర్ రైతు ల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించారు. రైతు కష్టాలు రైతుకే తెలుసు కాబట్టి స్వయంగా రైతు అయిన సీఎం కేసీఆర్ రైతుల ముఖాల్లో ఆ నందం చూడాలని నిర్ణయించుకుని ప్రాజెక్టుల నిర్మాణాలకు రూపకల్ప న చేశారు. అందులో భాగంగానే ప్రపంచం ఆశ్చర్యపోయే విధంగా కా ళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాన్ని అతితక్కువ సమయంలో పూర్తిచేసి రెండు పంటలకు సాగునీరుకు ఢోకా లేకుండా చేశారు. ఈ ప్రాజెక్టుతో ఉమ్మడి వరంగల్ జిల్లా రైతుల భూములు శశ్యశ్యామలం అవుతున్నారు. రిజర్వాయర్లను సైతం నింపుతున్నారు.

ఎండాకాలంలోనూ చెరువుల మత్తడి… ఉమ్మడి రాష్ట్రంలో ఎండాకాలంతో తాగడానికి కూడా నీరు లేని పరిస్థితి ఉండేది. మున్సిపాలిటీ, గ్రా మ పంచాయతీల ఆధ్వర్యంలో ట్యాంకుల ద్వారా తాగునీరు సరఫరాచే సే దుర్భర స్థితి ఉండేది. కానీ టీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చాక గ్రామాల్లో భూగర్భజలాల పెంపుపై ప్రత్యేక దృష్టి సారించింది. మిషన్ కాకతీయ పథకం ద్వారా మూడేళ్లుగా వరుస గా అన్ని గ్రామాల్లోని చెరువుల్లో అ నేక సంవత్సరాలుగా పూడుకుపోయిన పూడికతీతతో పాటు అభివృద్ధి పనులు చేపించింది. దీంతో వర్షాకాలంలో చెరువుల్లోకి చేరిన నీరు ని లబడే అవకాశం దొరికింది. భూగర్భజలాల పెరుగుదలకు కారణమైం ది. దీనికి తోడు జిల్లాలోని అన్ని గ్రా మాలతో పాటు, హనుమకొండ పట్టణంలో కూడా ప్రతీ ఇంట్లో ఇంకుడుగుంట నిర్మాణం చేసుకునేలా అ వగాహన కల్పించింది. కొత్తగా ఇల్లు నిర్మాణం చేసుకునే వారికి ఇంకుడుగుంత తప్పనిసరి చేసింది. దీంతో కూడా భూగర్భజలాలు భారీగా పెరిగాయి. దీని ఫలితంగా నిండు ఎం డాకాలం మేలో కూడా చెరువుల్లో అక్కడక్కడా మత్తడి దుంకిన పరిస్థితి కనిపించింది.

రైతుల కోసం సంక్షేమ పథకాలు… ఉమ్మడి రాష్ట్రంలో కరంట్ కష్టాలు అన్నీ ఇన్ని కాదు. మోటార్ ఆన్ చేస్తే మడి పారకముందే కరంట్ పోయే పరిస్థితి. కళ్లముందే పంట ఎండిపోవడం చూడలేని రైతులు బోరు ఒక టి, రెండు, మూడు ఇలా ఎన్ని వేసినా నీళ్లు పడే పరిస్థితి ఉండేది కాదు. రాష్ట్రం కల సాకారం కాగానే సీఎం కేసీఆర్ రైతులకు 24 గం టలు ఉ చిత విద్యుత్ అందించాలని నిర్ణయించడమే కాకుండా రూపాయి బిల్లు లేకుండా ఇప్పటి వరకు దిగ్విజయంగా అందిస్తున్నారు. దీంతో రైతన్న ల కష్టాలు తీరిపోయాయి. రైతు బంధు పథకంలో భాగంగా ఎకరాకు వానాకాలంలో రూ.5వేలు, రబీలో రూ.5 వేలు అందిస్తున్నారు. మొత్తం గా సంవత్సరానికి ఎకరాకు రూ.10వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తున్నారు. ఇలా ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని డబ్బులు నేరుగా రైతు ల ఖాతాల్లోనే జమ చేస్తున్నారు. ఈ రబీకి సంబంధించి కూడా ఐదు రో జుల్లో ఈనెల 15వ తేదీలోపు పడే అవకాశం ఉందని తెలుస్తోంది. కేం ద్ర ప్రభుత్వం మాత్రం ఎన్ని ఎకరాలు ఉన్నా సంవత్సరానికి రూ.6 వే లు రైతులకు ఇస్తుంది.

అదికూడా ఒక్కోసారి రూ.2 వేల చొప్పున మూ డు సార్లు రైతుల ఖాతాల్లో వేస్తుంది. ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి రైతు బీమా పథకాన్ని ప్రభుత్వం చేపట్టి ఏ కారణం చేతనైనా రైతు చనిపోతే వారం తిరగకముందే ఆ కుటుంబానికి సాయంగా రూ.5 లక్షలు అందిస్తుంది. ఉమ్మడి రాష్ట్రంలో ఆత్మహత్మ చేసుకున్న రైతులకు పరిహా రం ఇవ్వాలని వందల సార్లు దరఖాస్తులు పెట్టుకున్నా రూపాయి ఇచ్చి న పాపానపోలేదు. ఇప్పుడు గుంట భూమి ఉన్న రైతు కూడా తనువుచాలిస్తే ఆ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షలు అందించి ఆదుకుంటోంది. ధాన్యం సిరులు…. హనుమకొండ జిల్లాలో గతానికి ఇప్పటికి ధాన్యం దిగుబడులు భారీగా పెరిగాయి. రైతులకు ప్రభుత్వం అన్ని రకాలుగా సౌకర్యాలు కల్పిస్తుండడంతో భూములన్నీ సాగులోకి వచ్చా యి. పట్నం బాట పట్టిన వారు కూడా గ్రామాలకు వాపస్ వచ్చి ఎవు సం చేయాలని పూనుకుంటున్నారు. దీంతో ధాన్యం దిగుబడులు కూడా ఎవరూ ఊ హించని స్థాయిలో వస్తున్నాయి.

ఏటేటా పెరుగుతున్నాయి. గతంలో అమ్ముకోవడానికి ఇబ్బందులు పడే పరిస్థితులు ఉండేవి. ఇ ప్పుడు ఏ గ్రామానికి ఆ గ్రామంలోనే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచే సి కొనుగోలు చేస్తుండడంతో అన్నదాతల్లో ఆనందం వ్యక్తమవుతుంది. డబ్బులు కూడా ఆన్‌లైన్ అయిన వెంటనే నేరుగా రైతుల ఖా తాల్లో పడిపోతున్నాయి. దళారీ వ్యవస్థ లేకుండా నేరుగా రైతులకు గి ట్టుబాటు ధర లభిస్తుంది. అన్నదాతల కోసం ఢిల్లీలో ఫైట్… రబీలో వరి సాగు చేయవద్దని తాము కొనుగోలు చేయలేమని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి రాష్ట్ర ప్రభుత్వానికి లిఖితపూర్వకంగా లేఖ ఇచ్చారు.

దీంతో ప్రభుత్వం రైతులను ఆరుతడి పంటలు సాగుచేసేలా అవగాహన కల్పించింది. రైతులు వరిసాగు చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం ఎలా కొనుగోలు చేయదో చూస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలతో అన్నదాతల్లో అయోమయం నెలకొం ది. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వమే చెప్పన దానిని రాష్ట్రంలోని నేత తప్పుడు ప్రచారం చేయడంతో సీఎం కేసీఆర్ అన్నదాతల పక్షాన నిలిచారు. రబీ ధాన్యం కొనుగోలు చేసేలా కేంద్రాన్ని ఒప్పించాలని పలుమార్లు రాష్ట్ర నేతలకు సూచించారు. వారు స్పందించకపోవడంతో లోక్‌సభ సమావేశాల వేదికగా టీఆర్‌ఎస్ ఎంపీలు ఆందోళన చేపట్టారు. అ న్నదాతల కోసం ఎందాకైనా పోరాడుతామని చెప్పినట్లే ఢిల్లీలో ఎంపీల తో ఫైట్ చేపిస్తున్నారు. అన్నదాతలకు అండగా నిలుస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News