Thursday, March 20, 2025

ఉద్యోగాల కోసం భూమి కుంభకోణం కేసులో ఈడి ముందు హాజరైన రబ్రీ దేవి

- Advertisement -
- Advertisement -

పాట్నా: ఉద్యోగాల కోసం భూమి కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడి) ముందు మంగళవారం బీహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీ దేవి హాజరయ్యారు. తన పెద్ద కుమారుడు, కుమార్తె మీసా భారతితో కలిసి ఆమె బ్యాంక్ రోడ్డులోని ఈడి కార్యాలయానికి వచ్చారు. పాటలీపుత్ర ఎంపీ అయిన ఆమె ఉద్యోగం కోసం భూమి కుంభకోణం కేసులో నిందితురాలుగా ఉన్నారు. రబ్రీ దేవి, ఆమె కుమార్తెకు అనుకూలంగా అనేక మంది పార్టీ కార్యకర్తలు కూడా ఈడి కార్యాలయానికి చేరుకుని వారికి అనుకూలంగా నినాదాలు చేశారు. ‘ఓ రాష్ట్రంలో ఎన్నికలు జరుగబోతున్నప్పుడు బిజెపి తన ప్రత్యర్థులపై కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉపయోగిస్తుంది. ఇదివరకు ఝార్ఖండ్, ఢిల్లీలో మనం దీన్ని చూశాం. ఇప్పుడు బీహార్‌లో చూస్తున్నాం’ అని ఆర్‌జెడి ప్రతినిధి ఇజాజ్ అహ్మద్ పేర్కొన్నారు. మన్మోహన్ సింగ్ ప్రభుత్వం కాలంలో లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు ఉద్యోగాల కోసం భూమి కుంభకోణం చోటుచేసుకుందన్నది గమనార్హం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News