Monday, December 23, 2024

షీటీమ్ ఎస్ఐ మృతి… నివాళులర్పించిన రాచకొండ కమిషనర్

- Advertisement -
- Advertisement -

అనారోగ్యంతో మృతి చెందిన షీటీమ్ ఎస్సై

రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ ఐపిఎస్ నివాళులు

మేడ్చల్: అనారోగ్యంతో మృతి చెందిన షీటీమ్ ఎస్సై అబ్బ సాని బాలమల్లేశ్ యాదవ్ (58) మృతదేహానికి రాచకొండ సిపి మహేష్ భగవత్ ఐపీఎస్ ఈరోజు ఘట్కేసర్ కు వెళ్లి నివాళులు అర్పించారు. అతను ఏడేళ్లుగా షీటీమ్స్ లో పని చేస్తున్నారు. అయితే గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ బాలమల్లేష్ పార్థివ దేహంపై పుష్పగుచ్ఛం ఉంచి నివాళుర్పించారు. సిపి మహేష్ భగవత్ బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి రావాల్సిన బెనిఫిట్స్, పెన్షన్, ఉద్యోగం తొందరగా వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని వారికి ఆర్ధిక భరోసా కలిస్తామన్నారు. మల్కాజిగిరి ఎసిపి నరేష్ రెడ్డి, ఘట్కేసర్ సిఐ చంద్రబాబు, పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు భద్రా రెడ్డి, స్టేట్ వైస్ ప్రెసిడెంట్ కరుణాకర్ రెడ్డి తదితరులు నివాళులు అర్పించిన వారిలో ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News