Thursday, January 23, 2025

SSC Exams: పదో తరగతి పరీక్ష కేంద్రాలను సందర్శించిన రాచకొండ కమిషనర్

- Advertisement -
- Advertisement -

 

రాచకొండ: ఎంతటి అధికారి కూడా మొబైల్ ఫోన్స్ పరీక్ష కేంద్రాలలోకి అనుమతి లేకపోవడంతో పోలీస్ ఉన్నతాధికారులను కూడా లోపలికి వెళ్ళేటప్పుడు తనిఖీలలో భాగంగా ఉమెన్ కానిస్టేబుల్ కల్పన సార్  మొబైల్ ఫోన్ ను  అడిగి తీసుకున్నారని రాచకొండ కమిషనర్ డిఎస్ చౌహన్ తెలిపారు. ఎల్బీనగర్ లోని పదవ తరగతి పరీక్ష కేంద్రాలను రాచకొండ కమిషనర్ డిఎస్ చౌహన్, ఎల్బీనగర్ డిసిపి సాయి శ్రీ, ఎసిపి శ్రీధర్ రెడ్డి సందర్శించారు. కల్పన డ్యూటీ సక్రమంగా చేసినందుకు 500 రూపాయలు  రివార్డు ఇచ్చారు. ఉమెన్స్ కానిస్టేబుల్ డ్యూటీ విషయంలో నిక్కచ్చిగా విధులు నిర్వహిస్తున్న కల్పనను రాచకొండ కమిషనర్ ప్రశంసించారు. ప్రభుత్వం తరుపున నుంచి నియమ నిబంధనలు ఉండడంతో పరీక్ష కేంద్రాల లోపలికి వెళ్ళేటప్పుడు గేట్ వద్ద డ్యూటీ చేస్తున్న అధికారులు ప్రతి ఒక్కరినీ క్షుణ్ణంగా తనిఖీలు చేయాలని డిఎస్ సూచించారు, టెన్త్ పరీక్షల నేపథ్యంలో విద్యార్థుల భవిష్యత్ కోసం పరీక్ష కేంద్రాలలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు, ఎలాంటి లోపాలు, గొడవలు జరగకుండా పోలీస్ డిపార్ట్ మెంట్ నుంచి గట్టి బందోబస్తు చేస్తున్నా మని రాచకొండ సిపి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News